ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయాక తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరిగింది. ఇప్పుడు ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అక్కడ కూడా జిల్లాల పునర్విభజనకు కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా పెద్ద రెవెన్యూ డివిజన్లు, మండలాలను గుర్తించి వాటిని పునర్‌వ్యవస్థీకరించే దిశగా అడుగులు పడుతున్నాయి. పరిపాలనా సౌలభ్యంతోపాటు కొత్త జిల్లాల్లో సరిహద్దు, ఇతర సమస్యలు రాకుండా ఉండేందుకు పెద్ద డివిజన్లు, మండలాల పునర్విభజనపై దృష్టిసారించాలని రెవెన్యూశాఖ భావిస్తోంది. జిల్లాల సరిహద్దుపై ఏర్పాటైన సబ్ కమిటీ-కూడా ఇదే అంశంపై కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
ఇప్పటికే తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రల్లో జిల్లాల విభజనకు అనుసరించిన విధానాలు, వాటి మ్యాప్‌లను కమిటీ పరిశీలిస్తోంది. జిల్లాల విభజనకు ముందే పెద్ద డివిజన్లు, మండలాలను పునర్విభజన చేయాలని, ఇందుకు రోడ్‌మ్యా్‌ప్‌ను సిద్ధం చేయాలని కమిటీ భావిస్తున్నట్లు తెలిసింది. దీనిపై జిల్లాల వారీగా ఉన్న గ్రామాలు, మండలాలు, డివిజన్లు, వాటి విస్తీర్ణం, జనసాంద్రత, ఆస్తులు, భవనాలు, సాగు భూములు, ఇతర అంశాలపై సమగ్ర నివేదిక కోరింది.
Also Read: అమరావతి భూకుంభకోణం: టీడీపీ నేతలకు ‘సుప్రీం’ నోటీసులు
అయితే.. జిల్లాల పునర్విభజనకు ముందే పెద్ద డివిజన్లు, మండలాలను సైతం పునర్‌వ్యవస్థీకరించాలని రెవెన్యూ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఇందులో భాగంగా సబ్‌కమిటీ-1 కూడా ఇదే అంశంపై దృష్టి సారించింది. ‘పరిపాలనా సౌలభ్యం కోసం పెద్దవాటిని విభజించాలన్నది మొదటి నుంచి ఉంది. భవిష్యత్తులో ఎలాంటి సరిహద్దు, భౌగోళిక సమస్యలు రాకుండా ఉండేలా జిల్లాల ఏర్పాటు జరగాలంటే ముందుగా పలు నియోజకవర్గాల్లో కలిసి ఉన్న మండలాలు, డివిజన్లను విభజించాలి. దీని వల్ల అనేక అంశాల్లో స్పష్టత వస్తుంది. పరిపాలనా పరంగా ఏ ప్రాంతం ఎక్కడి వరకు ఉందన్నది తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వం దీనికి ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటోంది’ అని రెవెన్యూశాఖ ఉన్నతాధికారి అంటున్నారు.
Also Read: టీడీపీపై ‘పచ్చ’పాతం చూపకపోతే సోము వీర్రాజు విలనేనా?
ప్రస్తుతం రాష్ట్రంలో 17,460 గ్రామాలు, 679 మండలాలు, 51 రెవెన్యూ డివిజన్లు, 13 జిల్లాలు ఉన్నాయి. ప్రతి లోక్‌సభ స్థానాన్ని ఓ జిల్లాగా మార్చాలన్నది ప్రభుత్వ నిర్ణయం. ఈ లెక్కన మొత్తం 25 లేదా 26 జిల్లాలు ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందులో ఒక పెద్ద గిరిజన జిల్లా కూడా ఉండనుంది. ‘కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాలకు మండలాలు, డివిజన్లను సమానంగా పంపిణీ చేయాల్సి ఉంది. పెద్ద వాటి విభజనలో ప్రజాభిప్రాయం కూడా కోరాల్సి ఉంటుంది. కొత్తగా 20 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఇదొక అంశమైతే, ఇప్పుడున్న వాటిల్లోనే 35 డివిజన్లను కొత్త జిల్లాల కోసం పునర్‌వ్యవస్థీకరణ చేయాల్సి వస్తోంది. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత తక్షణ అవసరంగా 11 కొత్త డివిజన్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని సమాచారం.