Revanth : ప్రతి సందర్భంలో గులాబీ సోషల్ మీడియా తమల్ని ఎటాక్ చేస్తోందని.. కావాలని టార్గెట్ చేస్తుందని చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు.. కావాలనో లేక తెలియకో వారికి అవకాశం ఇస్తే ఎందుకు ఊరుకుంటారు.. ముఖ్యమంత్రి పేరును ఆ మధ్య బాలాదిత్య అనే యాంకర్ మర్చిపోయాడు. అంతకుముందు అల్లు అర్జున్ కూడా మర్చిపోయాడు. దానిని కాంగ్రెస్ నాయకులు రచ్చ రచ్చ చేశారు. జగ్గారెడ్డి లాంటివాళ్ళు.. కూడా ఇలాంటి ధోరణి ప్రదర్శించారు. ఆ తర్వాత విమర్శల పాలయ్యారు. అయితే దీనిని అనుకూలంగా మార్చుకున్న గులాబీ సోషల్ మీడియా.. రెచ్చిపోయింది. దానికి ఎన్ని వక్రీకరణలు చేయాలో అన్నీ చేసేసింది. ఆ సోషల్ మీడియా అంటేనే పూర్తి నొటోరియస్.. చెడు ప్రచారం చేయడంలో.. గిట్టని వారి మీద రాళ్లు ఎలా వేస్తుందో అందరికీ తెలుసు. అయితే అలాంటి సోషల్ మీడియా వింగ్ ను జాగ్రత్తగా డిపెండ్ చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ.. చివరికి తనే బలి పశువు అవుతోంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పేరుని మర్చిపోయి.. ఉత్తంకుమార్ రెడ్డి పేరు వ్యాఖ్యానించడం విశేషం.
Also Read : సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానాన్ని తిరస్కరించిన అల్లు అర్జున్..కారణం ఏమిటంటే!
ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి..ఎస్ ఎల్ బీ సీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఉత్తంకుమార్ రెడ్డి చీఫ్ మినిస్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎస్ ఎల్ బీ సీ పనులు మళ్లీ పున: ప్రారంభమయ్యాయని వ్యాఖ్యానించారు. సరిగ్గా ఇదే విషయాన్ని గులాబీ సోషల్ మీడియా గట్టిగా పట్టుకుంది. ఇంకేముంది ఎంత నెగటివ్ ప్రచారం చేయాలో అంత చేసి పడేసింది. గులాబీ సోషల్ మీడియా వల్ల ఎస్ ఎల్ బీ సీ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి చేపట్టిన విషయం గాల్లో కలిసిపోయింది. కనీసం ఆ క్రెడిట్ కూడా తమది అని చెప్పుకునే స్థితి నుంచి.. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ఫలితంగా.. సెల్ఫ్ డిఫెండ్ చేసుకునే దుస్థితికి దిగజారింది. ఇన్నాళ్లపాటు ప్రతిపక్ష నాయకులు.. ఇతర సెలబ్రిటీలు కక్ష కట్టారని ఆరోపించిన కాంగ్రెస్ నాయకులు.. స్వయంగా రేవంత్ రెడ్డి తన పేరు మర్చిపోతే.. దానికి ఏం పేరు పెడతారో వారికే తెలియాలి. అన్నట్టు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక గులాబీ మీడియా అయితే రేవంత్ చేసిన వ్యాఖ్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ.. ఏకంగా డిబేట్ లు కూడా నిర్వహిస్తోంది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా రేవంత్ కాస్త జాగ్రత్తగా మాట్లాడాలని.. అసలే గులాబీ సోషల్ మీడియా విపరీతమైన యాక్టివ్ గా ఉందని.. ఈ పరిస్థితిలో వారి చేతికి చికితే చెడుగుడు ఆడుకుంటారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Also Read : రేవంత్ రెడ్డిది.. నిజాయతీ లేక నిస్సహాయత?
తన పేరు తానే మర్చిపోయిన రేవంత్ రెడ్డి
ఇన్నిరోజులు ఇతరులు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోగా ఈసారి ఏకంగా తన పేరు తానే మర్చిపోయిన రేవంత్
తాను ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి అన్న రేవంత్ రెడ్డి pic.twitter.com/qVzUagpISC
— Telugu Scribe (@TeluguScribe) May 14, 2025