IPL 2025: ఇక ఐపీఎల్ అనుకోని సంఘటనల వల్ల వాయిదా పడిన నేపథ్యంలో.. మళ్లీ ఈనెల 17 నుంచి మొదలు కాబోతోంది. ఈ క్రమంలో ప్లేయర్ల విషయంలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి.. చివరికి జట్లు టెంపరరీ రీప్లేస్మెంట్ చేయక తప్పడం లేదు. ఫారిన్ ప్లేయర్లు పున: ప్రారంభ మ్యాచ్లలో ఆడేందుకు రాకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఐపీఎల్ యాజమాన్యం ఆ ప్లేయర్ల స్థానంలో టెంపర రీ ప్లేస్మెంట్ అవకాశాన్ని మేనేజ్మెంట్లకు ఇచ్చింది. వాస్తవానికి ఐపీఎల్ నిబంధన ప్రకారం ఒక టీంలోకి కొత్త ప్లేయర్ రావాలి అంటే.. 12 మ్యాచ్లు పూర్తవ్వాలి. రీప్లేస్మెంట్ కు గురయ్యే ప్లేయర్ గాయం లేదా ఇతర కారణాల వల్ల క్రికెట్ ఆడలేని పరిస్థితి ఉంటేనే బీసీసీఐ రీప్లేస్మెంట్ కు అనుమతిస్తుంది. ఇక రీస్టార్ట్ సీజన్లో జట్లకు ఆడేందుకు రాని ప్లేయర్లకు 2026 సీజన్ కు రిటెన్షన్ ఉండదని బిసిసిఐ స్పష్టం చేసింది. అయితే కాదు దీనిపై గురువారం లేదా శుక్రవారం కీలక ప్రకటనను బీసీసీఐ వెల్లడించే అవకాశం ఉంది.
Also Read: విదేశీ ప్లేయర్లు రావడం లేదు.. ఐపీఎల్ రీ స్టార్ట్ అవుతుందా? లేదా?
అతని స్థానంలో..
ఫారిన్ ప్లేయర్లు ఐపీఎల్ ఆడేందుకు విముఖత చూపిస్తున్న నేపథ్యంలో.. వారి ప్లేసులో టెంపరరీగా కొందరి ప్లేయర్లను టీం లోకి తీసుకోవడానికి యాజమాన్యాలు రెడీ అయ్యాయి. ఆస్ట్రేలియా వెళ్లిపోయిన జేక్ ఫ్రేజర్ మెక్ గూర్క్ ఐపీఎల్ ఆడేందుకు రానని స్పష్టం చేయడంతో.. అతడి ప్లేసులో బంగ్లాదేశ్ ఫేస్ బౌలర్ ముస్తాఫిజుర్ ను ఢిల్లీ యాజమాన్యం జట్టులోకి తీసుకుంది. అయితే ముస్తాఫిజుర్ కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇంకా ఇష్యూ చేయలేదు..
ఎవరెవరు ఆడతారు అంటే
పంజాబ్ జట్టుకు బార్టెట్, అజ్మతుల్లా, ఓవెన్ ఆడుతారు.
బెంగళూరు జట్టుకు లివింగ్ స్టోన్, సాల్ట్ ఆడతారు.
ముంబై జట్టుకు బౌల్ట్, ముజీబ్ రహ్మాన్ ఆడుతారు.
హైదరాబాద్ జట్టుకు కమిన్స్, హెడ్, క్లాసెన్ఆడుతారు.
నూర్ అహ్మద్, బ్రేవిస్, కాన్వే, పతిరన, సామ్ కరణ్ చెన్నై జట్టుకు ఆడతారు.
వీళ్ళు కష్టమే
పంజాబ్ జట్టులో స్టోయినీస్, ఇంగ్లిస్, ఆరోన్ హార్డీ ఆడేది అనుమానమే.
గుజరాత్ జట్టులో బట్లర్ ఆడేది అనుమానమే.
ముంబై జట్టులో కార్బిన్ బోస్, విల్ జాక్స్ ఆడేది అనుమానమే.
హైదరాబాద్ జట్టులో ఈశాన్ మలింగ, కమిందు మెండిస్, ముల్డర్ ఆడేది అనుమానమే.
చెన్నై జట్టులో రచిన్ రవీంద్ర ఆడేది అనుమానమే.
కోల్ కతా లో మోయిన్ అలీ, స్పెన్సర్ జాన్సన్ ఆడకపోవచ్చు.
వీళ్ళు దూరమయ్యారు
రబాడ, రూథర్ఫోర్డ్, కోఎడ్జి పంటి ప్లేయర్లు గుజరాత్ జట్టుకు ఆడబోరు.
స్టార్క్, జేక్ ఫ్రేజర్, స్టబ్స్ ఢిల్లీ జట్టులో ఆడరు.
రోమారియో షెఫర్డ్, ఎంగిడి, హేజిల్ వుడ్, బెతల్ బెంగళూరు జట్టుకు ఆడబోరు.
లక్నో ప్లేయర్ మార్కం, పంజాబ్ ప్లేయర్ మార్కో జాన్సన్, ముంబై ప్లేయర్ రికెల్టన్ ఆయా జట్లకు ఆడబోరు.