IPL Rescheduled 2025: ప్లే ఆఫ్ సమీకరణాలు అత్యంత ఉత్కంఠ గా మారిన నేపథ్యంలో లీగ్ మ్యాచ్ లు ఎలా సాగుతాయోనని అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ స్టేజిలో కొందరు కీ ప్లేయర్ల సేవలు కోల్పోతుండడం అమ్మిజట్లకు నిరాశ కలిగిస్తోంది. అభిమానులు కూడా ఈ పరిణామాలు చూసి ఇబ్బంది పడుతున్నారు.. వాస్తవానికి మే 25న ఐపీఎల్ పూర్తి కావాలి. ఆ తర్వాత ఫారిన్ ప్లేయర్లకు ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఉండడంతో మే ఎండింగ్ కల్లా వారి వారి దేశాలకు వెళ్లడానికి ఒక ప్రణాళిక రూపొందించుకున్నారు. హఠాత్తుగా తొమ్మిది రోజుల గ్యాప్ వచ్చింది. దీంతో లీగ్ అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యంగా ముగించాల్సిన దుస్థితి ఏర్పడింది. శనివారం రీస్టార్ట్ అవుతున్నా నేపథ్యంలో ఐపీఎల్ జూన్ 3 వరకు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సీజన్ అకస్మాత్తుగా నిలిచిపోవడంతో.. మెజారిటీ ఫారిన్ ప్లేయర్లు.. వారి వారి సొంత దేశాలకు వెళ్లిపోయారు. కొంతమంది ప్లేయర్లు మాత్రమే మన దేశంలో ఉండిపోయారు. అలా వెళ్ళిన వారిలో తిరిగి వచ్చే వారు అత్యంత తక్కువగా ఉన్నారు.
Also Read: రోహిత్, విరాట్ కోహ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్ పై బీసీసీఐ కీలక నిర్ణయం..
జూన్ 11 నుంచి.. డబ్ల్యూటీసీ
ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా వచ్చే నెల 11 నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ ఆడతాయి.. ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లకు కూడా ఇంటర్నేషనల్ సిరీస్ లు ఉన్నాయి. దీంతో ఈ ఐపీఎల్ కు ఆ దేశానికి సంబంధించిన ప్లేయర్లు అందుబాటులో ఉండేది అవకాశమే. ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ కోసం ఎంపికైన ప్లేయర్లు ఐపీఎల్ కోసం ఇండియా ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దని సఫారీ క్రికెట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఇక మిగతా బోర్డులు కూడా ఉత్తమ ప్లేయర్లకు ఒకరకంగా ఇటువంటి రూల్స్ విధించాయి.. ఈ నిబంధన ప్రకారం గుజరాత్ టైటాన్స్ జట్టులో రబాడా(సౌత్ ఆఫ్రికా), రూథర్ ఫోర్డ్(వెస్టిండీస్), బట్లర్ (ఇంగ్లాండ్) ఆడే అవకాశం లేదు. ముంబై ఇండియన్స్ కు రికెల్టన్ (సౌత్ ఆఫ్రికా) ఆడే అవకాశం లేదు.. బోష్(సఫారి జట్టు), ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ విల్ జాక్స్ మాత్రమే అందుబాటులో ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఇక బెంగళూరుకు హేజిల్ వుడ్ (ఆస్ట్రేలియా), బెతల్ (ఇంగ్లాండ్), ఎంగిడి (సౌత్ ఆఫ్రికా), రోమారియో షెఫర్డ్ (వెస్టిండీస్) దూరమయ్యే అవకాశం ఉంది.. స్టార్క్, స్టబ్స్ దూరం అవుతున్న నేపథ్యంలో ఢిల్లీ జట్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. లక్నో కు కీలక ప్లేయర్ మార్కం (సఫారి జట్టు) దూరం కాబోతున్నాడు.. యాన్సెన్(సౌత్ ఆఫ్రికా) పంజాబ్ జట్టు ఆడేది అనుమానం గానే ఉంది.. అయితే ఈ ఐపీఎల్లో ఇప్పటికే ప్లే ఆఫ్ అవకాశాలకు దూరమైన హైదరాబాద్ జట్టులో హెడ్ , కమిన్స్ ఆడతారని ప్రచారం జరుగుతోంది. ఆశించిన స్థాయిలో విదేశీ ప్లేయర్లు రాకపోవడంతో.. ఈ ఐపీఎల్ రీస్టార్ట్ అవుతుందా? అనే ప్రశ్న వ్యక్తమౌతోంది. దీనిపై అభిమానులు రకరకాలుగా తమ సందేహాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. అయితే చివరికి ఐపీఎల్ పెద్దలు రంగంలోకి దిగి అన్ని సమస్యలకు పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో టోర్నీ సజావుగానే సాగుతుందని తెలుస్తోంది.