CM Revanth Reddy and Allu Arjun : నిన్న హైదరాబాద్ లోని చౌమహల్లా ప్యాలెస్ లో మిస్ వరల్డ్ 2025 పోటీలు గ్రాండ్ గా జరిగాయి. ఈ ఈవెంట్ కి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) టాలీవుడ్ ప్రముఖులందరినీ ఆహ్వానించాడు. వారిలో అల్లు కుటుంబం కూడా ఉంది. కానీ అల్లు కుటుంబం నుండి కేవలం అల్లు అరవింద్(Allu Aravind) మాత్రమే ఈ ఈవెంట్ లో పాల్గొన్నాడు. అల్లు అర్జున్ రాకపోవడం సోషల్ మీడియా లో చర్చనీయాంశం అయ్యింది. అయితే గత ఏడాది డిసెంబర్ నెలలో జరిగిన సంఘటనలను అల్లు అర్జున్ మర్చిపోలేదని, అరెస్ట్ చేయించిన ఘటన కంటే, పవిత్రం గా భావించే అసెంబ్లీ లో సీఎం రేవంత్ రెడ్డి తన క్యారక్టర్ ని బ్యాడ్ చేస్తూ మాట్లాడాడని, ఆ విషయం అల్లు అర్జున్(Icon Star Allu Arjun) మనసులో అలాగే ఉండిపోవడం వల్లే ఆయన రాలేకపోయాడని సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే వాటిల్లో ఎలాంటి నిజం లేదని అల్లు అర్జున్ అభిమానులు చెప్తున్నారు.
Also Read : అల్లు అర్జున్, అట్లీ సినిమాలో హీరోయిన్ ఆమేనా..? ఫ్యాన్స్ ఏమైపోతారో!
అల్లు అర్జున్ కి పాత విషయాలను మనసులో పెట్టుకునే అలవాటు లేదని, ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లో లేడనీ, విదేశాల్లో ఉన్నాడని చెప్పుకొచ్చారు. త్వరలోనే అల్లు అర్జున్ తమిళ డైరెక్టర్ అట్లీ తో ఒక భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మేకోవర్ కోసం ఆయన విదేశాల్లో ఉన్నాడు. అక్కడ వర్కౌట్స్ చేసి సిక్స్ ప్యాక్ బాడీ పెంచే ప్రయత్నమే కాకుండా, సినిమాకు తగ్గట్టుగా తన లుక్ ని మార్చబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. గత రెండు వారాల నుండి అందుకోసం ఆయన విదేశాల్లోనే ఉన్నాడు. అందుకే నిన్నటి ఈవెంట్ కి రాలేకపోయాడని చెప్తున్నారు. ఇవన్నీ సోషల్ మీడియా లో వినిపిస్తున్న ఊహాగానాలు మాత్రమే. అసలు నిజమేంటో తెలియాల్సి ఉంది. కానీ అల్లు అర్జున్ విదేశాల్లో ఉన్నాడు అనేది విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.
ఇది ఇలా ఉండగా ఈ ఈవెంట్ లో ఎవ్వరూ ఊహించని ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. అక్కినేని నాగార్జున కి తెలంగాణ ప్రభుత్వం ద్వారా జరిగిన నష్టం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన హైడ్రా ద్వారా అక్రమ కట్టడాల క్రింద N కన్వెన్షన్ హాల్ ని కూల్చేశారు. అప్పట్లో నాగార్జున అన్యాయం అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే విధంగా ఆయన క్యాబినెట్ లోని మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలను కూడా అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ రెండు సంఘటనలు జరిగిన తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించిన వెంటనే సతీమణి అమలతో కలిసి ఈ ఈవెంట్ లో పాల్గొనడమే కాకుండా రేవంత్ రెడ్డి పక్కనే కూర్చోవడం అందరినీ షాక్ కి గురి చేసింది.
Also Read : రేవంత్ రెడ్డిది.. నిజాయతీ లేక నిస్సహాయత?