Wild Dogs: తెలంగాణ అడవులు జీవ వైవిధ్యానికి నిలయాలు. ఇక్కడి అడవుల్లో వందల రక్షాల జంతువులు, పక్షులు, సరీశృపాలు, క్రిమి కీటకాలు ఉన్నాయి. పర్యావరణ ప్రేమికులు, జంతు ప్రేమికులు ఏటా తెలంగాణలోని అడవుల్లో పర్యటించి అరుదైన కొత్త కొత్త జంతువులు, పక్షులు, సీతాకోక చిలకలు, క్రిమి కీటకాలను గుర్తిస్తున్నారు. ఇక తెలంగాణలోని అనేక ప్రాంతాలకు దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు విదేశాల నుంచి కూడా పక్షులు వలస వస్తున్నట్లు గుర్తిస్తున్నారు. సీజన్‌లో ఇక్కడే ఉండి సీజన్ ముగియగానే వెళ్లిపోతున్నాయి. అయితే తాజాగా తెలంగాణలోని అడవుల్లో అరుదైన, అంతరించిపోయాయనుకున్న ఇండియన్ వైల్డ్ డాగ్స్ కనిపించాయి. వాటి కదలికల దృశ్యాలు అటవీ శాఖ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
అరుదైన డాగ్స్..
ఇండియన్ వైల్డ్ డాగ్స్( అడవి కుక్కలు) తెలంగాణలో కనిపించాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ అడవుల్లో అరుదైన ఇండియన్ వైల్డ్ డాగ్స సంచారం కెమెరాలకు చిక్కింది. ఓ నీటి క ఉంట వద్ద నీళ్ల కోసం వచ్చిన ఇండియన్ వైల్ డాగ్స్ దృశ్యాలు వైరల్‌గా మారాయి. కమ్మర్గాం–మురళిగూడ మధ్య అటవీ ప్రాతంలోని చెరువు వద్ద మూడు ఇండియన్ వైల్డ్ డాగ్స్ కనిపించాయి. పెంచికల్ పేట్ రేంజ్ పరిధిలో సుమారు ఐదు నుంచి పది వరకు ఏసియన్ వైల్డ్ డాగ్స్ ఉన్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. అంతరిపోతున్న జీవజాతుల్లో ఒకటైన వైల్డ్ డాగ్స్‌కు ఎవరైనా హాని తలపెడితే కఠిన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.
జీవ వైవిధ్యానికి వేదిక…
తెలంగాణలోని కృష్ణతీరం నల్లమల్ల, గోదావరి తీరంలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని అడవులు పెద్దపులులు, అరుదైన వన్యప్రాణులకు ఆవాసంగా మారాయి. జీవ వైవిధ్యానికి నిలయంగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో అరుదైన ఇండియన్ వైల్డ్ డాగ్స్‌దేశంలో పెంచ్ నేషనల్ పార్క్, సత్పురా నేషనల పార్క్, సెంట్రల్ ఇండియాలోని తడోబా నేషనల్ పార్క్, దక్షిణ కర్ణాటకలోని బందీపూర్, నాగర్మోల్ నేషనల్ పార్కుల్లో కనిపిస్తాయి. మధ్య భారత దేశం, పశ్చిమ, తూర్పు హిమాలయాలలో అరుణాచల్‌ప్రదేశ్, అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్‌లోని అడవుల్లో కూడా వీటిని చూడవచ్చు.
ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పెట్ రేంజ్ లో అరుదైన అడవి కుక్కలు.. ఏషియన్ వైల్డ్ డాగ్స్ గా ప్రాచుర్యం పొందిన ఈ కుక్కలు సామాన్యంగా జనాలకి కనిపించవు.. కుమ్మర్గాo, మురలిగూడ మధ్య అడవి ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు వీటిని గుర్తించారు. pic.twitter.com/A1cW35zJE1
— Mr. Mohan (@kundenapally_12) November 22, 2024