Ram Charan : రామ్ చరణ్ నటించిన పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్ విడుదలకు సమయం దగ్గర పడుతుంది. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ నుండి క్రేజీ అప్డేట్ వచ్చింది. మరి ఆ సర్ప్రైజింగ్ అప్డేట్ ఏమిటో చూద్దాం..
భారీ చిత్రాల దర్శకుడు శంకర్-రామ్ చరణ్ కాంబోలో వస్తుంది గేమ్ ఛేంజర్. అవుట్ అండ్ అండ్ పొలిటికల్ థ్రిల్లర్ గా మూవీ తెరకెక్కుతుంది. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఆయన పీరియాడిక్ రోల్ లో పొలిటీషియన్ గా, ప్రజెంట్ బ్యాక్ డ్రాప్ లో ఐఏఎస్ అధికారికంగా కనిపిస్తాడని సమాచారం సమాజంలో ఉన్న చెడును సినిమాటిక్ సబ్జెక్టు గా తీసుకుని, కమర్షియల్ చిత్రాలు చేయడంలో శంకర్ దిట్ట. ఆయన ఒక ట్రెండ్ సెట్టర్. జెంటిల్ మెన్ నుండి భారతీయుడు 2 వరకు ఆయన ప్రతి సినిమాలో సమాజంలో పాతుకుపోయిన దురాగతాలను చర్చించారు.
ఇక శంకర్ తెరకెక్కించిన ఒకే ఒక్కడు.. చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. అర్జున్ హీరోగా దశాబ్దాల క్రితం వచ్చిన ఈ మూవీ ఇప్పటికీ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. నేటి పొలిటికల్ సిట్యుయేషన్స్ ని ప్రతిబింబిస్తుంది. ఒకే ఒక్కడు అనంతరం శంకర్ తెరకెక్కిస్తున్న పూర్తి స్థాయి పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్ అని చెప్పొచ్చు. అందుకే అంచనాలు భారీగా ఉన్నాయి. కొన్ని కారణాల వలన గేమ్ ఛేంజర్ విడుదల ఆలస్యమైంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రం విడుదల కానుంది.
ఇక విడుదలకు మరో ఆరు వారాల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు. గేమ్ ఛేంజర్ నుండి థర్డ్ సింగిల్ వస్తున్నట్లు థమన్ తెలియజేశాడు. ఈ మేరకు ఆయన ఇంట్రెస్టింగ్ వీడియో తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు. సదరు వీడియోలో సింగర్స్ కార్తీక్, శ్రేయా ఘోషల్ ఉన్నారు. ”నాన్నా హైరానా” అనే బ్యూటిఫుల్ మెలోడీ నవంబర్ 28న విడుదల చేస్తున్నారట. ఈ సాంగ్ చాలా అద్భుతంగా ఉంటుందని కార్తీక్, శ్రేయా ఘోషల్ తెలియజేశారు.
గేమ్ ఛేంజర్ మూవీ నుండి ఇప్పటి రెండు సాంగ్స్ విడుదలయ్యాయి. నాన్నా హైరానా… మూడో సాంగ్. ఇది మనసుకు హత్తుకునే మెలోడీ అంటున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ కి జంటగా కియారా అద్వానీ నటిస్తుంది. సునీల్, శ్రీకాంత్, ఎస్ జే సూర్య కీలక రోల్స్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ మూవీ అద్భుతంగా ఉంటుందని ఇటీవల డబ్బింగ్ చెప్పిన ఎస్ జే సూర్య సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. ఆయన షార్ట్ రివ్యూ రామ్ చరణ్ ఫ్యాన్స్ కి మరింత కిక్ ఇచ్చింది.
#NaanaaHyraanaa ⭐️#GameChangerThirdSingle
From NOV 28 th ❤️ pic.twitter.com/sYGtObsmsk— thaman S (@MusicThaman) November 26, 2024