https://oktelugu.com/

Ram Gopal Varma: నాకు భయం లేదు, అందుకే రాలేకపోతున్నా, వెలుగులోకి ఆర్జీవీ! వీడియో వైరల్

ఫోటో మార్ఫింగ్ కేసులో బుక్ అయిన ఆర్జీవీ కోసం ఏపీ పోలీసులు వెతుకుతున్న సంగతి తెలిసిందే. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు హైదరాబాద్ వచ్చారు. ఆర్జీవీ నివాసంతో పాటు పలు చోట్ల గాలింపు చేపట్టారు. ఆర్జీవీ ఎక్కడ? అనే సస్పెన్స్ నెలకొన్న నేపథ్యంలో ఆయన ఓ సంచలన వీడియో విడుదల చేశారు.

Written By:
  • S Reddy
  • , Updated On : November 27, 2024 / 09:11 AM IST

    Ram Gopal Varma(5)

    Follow us on

    Ram Gopal Varma: గతంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలో ఏపీ పోలీసులు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఆర్జీవీ విచారణకు రాకపోవడంతో అదుపులోకి తీసుకునేందుకు హైదరాబాద్ వచ్చారు. ఒంగోలు రూరల్ సీఐ తన సిబ్బందితో ఆర్జీవీ ఇంటికి రాగా హైడ్రామా చోటు చేసుకుంది. అయితే ఆర్జీవీ ఇంట్లో లేరని తెలిసింది. ఆయన కోసం గాలింపు చేపట్టారు.

    ఆర్జీవీ వర్చువల్ గా విచారణకు హాజరు అవుతారని ఆయన తరపు లాయర్లు తెలియజేశారు. అయినప్పటికీ పోలీసులు సెర్చింగ్ కొనసాగించారు. ఆర్జీవీ భయపడి పారిపోయాడని మీడియాలో కథనాలు వస్తుండగా.. ఆయన వీడియో బైట్ విడుదల చేశారు. ప్రచారం అవుతున్నట్లు నేను పారిపోయలేదు. భయపడటం లేదు అన్నారు.

    రామ్ గోపాల్ వర్మ సదరు వీడియోలో… నేనేదో వణికి పోతున్నాను, మంచం క్రింద దాక్కున్నాను అంటున్నారు. నాకు భయం లేదు పారిపోలేదు. ఎప్పుడో ఏడాది క్రితం పెట్టిన పోస్టుకి నాలుగు రోజుల వ్యవధిలో నాలుగు ప్రాంతాలకు చెందిన వ్యక్తుల మనోభావాలు ఒకేసారి దెబ్బతినడం ఏమిటీ? అసలు పోస్ట్ కి సంబంధించిన వాళ్ళ మనోభావాలు దెబ్బ తినలేదు. సంబంధం లేని వారి మనోభావాలు దెబ్బతిన్నాయి.

    పోలీసులను రాజకీయనాయకులు ఆయుధాలుగా వాడుకుంటున్నారు. ఇది విదేశాల్లో కూడా జరుగుతుంది. అయితే న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉంది. దాన్ని నేను నమ్ముతాను. నేను ఒక సినిమాకు పని చేస్తున్నాను. అందుకే హాజరు కాలేకపోయాను. కొంచెం సమయం అడిగాను. మధ్యలో నేను వస్తే ప్రొడ్యూసర్ నష్టపోతాడు. నా కేసు అంత ఎమర్జెన్సీ ఏంటి? మర్డర్ కేసుల కోసం నెలలు, సంవత్సరాలు తీసుకుంటున్నారు కదా.. అని వివరణ ఇచ్చాడు. వర్మ వీడియో వైరల్ అవుతుంది.

    కాగా వర్మ గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్, పవర్ స్టార్ వంటి చిత్రాలు.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లకు వ్యతిరేకంగా చిత్రీకరించారు. వై ఎస్ జగన్ బయోపిక్ తెరకెక్కించిన వర్మ.. ఆ చిత్రాల్లో కూడా వారిని విలన్స్ గా చిత్రీకరించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దాంతో వర్మ అరెస్ట్ కి రంగం సిద్ధమైంది.