
Vundavalli Sridevi: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి షాక్ ఇచ్చిన ఉండవల్లి శ్రీదేవి ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ నేతకు ఫోన్ చేసి అధికార పార్టీలో రెడ్డి ఆధిపత్యం గురించి దళిత ఎమ్మెల్యేలు న ందిగామ సురేశ్, జోగి రమేశ్ ఎదుర్కొంటున్నా ఇబ్బందులు ఆ ఆడియోలో ఉన్నాయి. వైసీపీ నేత అప్పిరెడ్డి చెలాయిస్తున్న ఆధిపత్యం గురించి ప్రస్తావించారు. అధికార పార్టీపై ఉన్న అక్కసు మొత్తాన్ని ఆడియోలో కక్కేశారు.
‘నందిగామ’ను కుక్కలా వాడుకుంటున్నారని..
వైసీపీ ఎమ్మెల్యే నందిగామ సురేశ్‌ను అధికార పార్టీలోని రెడ్డి సామాజికవర్గం నేతలు కుక్కలా వాడుకుంటున్నారని ఆడియోలో శ్రీదేవి పేర్కొన్నారు. దిశ కమిటీ సమావేశం ఇటీవల ఎంపీ భరత్ సమక్షంలో ఏర్పాటు చేశారని, ఆ సమావేశానికి నంగిగామ సరేశ్‌ను కనీసం వేదికపైకి కూడా ఆహ్వానించకుండా అవమానించారని ఆరోపించారు. నందిగామ మాత్రం జగన్ వీరాభిమానిలా సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. రెడ్డి సామాజిక వర్గ నేతలు కుక్కలా నందిగామను వాడుకుంటున్నారని ఆరోపించారు.
జోగి రమేశ్ కూడా..
జోగి రమేశ్ కూడా దళిత ఎమ్మెల్యే కావడంతో అధికార పార్టీలోని అగ్రవర్ణ నేతలు ఇష్టానుసారం ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా అప్పిరెడ్డి జోగి రమేశ్‌ను దళిత ఎమ్మెల్యేలతో కలవకుండా, తమ వద్ద ఉండేలా ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దళిత ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడినా రెడ్లు సహించడం లేదని పేర్కొన్నారు. దళితులు పరస్పర సహకారం చేసుకోకుండా యత్నిస్తున్నారని విమర్శించారు.
పవర్ అంతా తమ చేతిలో ఉండాలి..
దళితులు ఎమ్మెల్యేలుగా ఎన్నికైనా రెడ్డి సామాజిక వర్గ నేతలు అధికారం, పవర్ తమ చేతిలో ఉండేలా చూసుకుంటున్నారని, దళిత ఎమ్మెల్యేలను అణచివేయాలని చూస్తున్నారని తెలిపారు. ఓ ఫంక్షన్‌తో తాను, జోగి రమేశ్ కలిసి మాట్లాడడాన్ని కూడా అప్పిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి సహించలేకపోయారని తెలిపారు. వెంటనే జోగి రమేశ్‌ను పిలిచి తనతో మాట్లాడకుండా చేశారని పేర్కొన్నారు. నియోజకవర్గానికి వెళ్లినప్పుడు స్థానిక ఎమ్మెల్యే గురించి మంచి మాటలు చెప్పడం తప్పు కాదని జోగి రమేశ్ చెప్పారని తెలిపారు.

దళితులను విడదీసే కుట్ర..
వైసీపీలో దళితులను విడదీసి పాలించేలా రెడ్డి సామాజికవర్గ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని శ్రీదేవి ఆరోపించారు. అగ్రకుల ఆధిపత్యంతో వారికే నష్టం జరుగుతోందని ఆరోపించారు. అందుకే దేవుడు వారికే నష్టం జరుగుతోందన్నారు. తనకు పోటీగా మద్దాల గిరిని కూడా తెచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు మద్దాల గిరికి, తనకు, షబ్నంకు పోటీ పెట్టారని ఆరోపించారు. ముగ్గురం కొట్టుకునేలా చేశారని పేర్కొన్నారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించామని ఆడియోలో శ్రీదేవి తెలిపారు. ఏదో రాజకీయాలు చేయాలని చూస్తే చివరకు వారికే నష్టం జరుగుతోందని, ఒకరి లైఫ్‌లో, ఒకరి నియోజకవర్గంలో చొరబడాలని చూస్తే నష్టం తప్పదని హెచ్చరించారు.
మొత్తంగా అధికార వైసీపీలోనే ఉంటూ.. అధికార పార్టీకే వెన్నుపోటు పొడిచిన ఎమ్మెల్యే శ్రీదేవి తాను మహానటికి తక్కువేం కాదని నిరూపించుకున్నారు.