Ramadan 2023: నేడు రంజాన్ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ముస్లిం కుటుంబాల్లో పండుగ వాతావరణం కనిపిస్తుంది. పేదవారైనా ధనికుడైనా సరే దేవుడికి అందరు సమానమనే ఉద్దేశంతో అందరు తమలో కొద్దో గొప్పో దాన గుణం ఉంటుంది. వారికి ఉన్న దాంట్లో దానం చేయడం మంచి అలవాటు. ఈనేపథ్యంలో ముస్లింలకు అత్యంత పవిత్రమైన పండుగ రంజాన్. దీంతో ఈ రోజు ఎంతో ఆనందంగా గడుపుతుంటారు. ప్రత్యేక పూజలు చేసి దేవుడిని ప్రార్థిస్తుంటారు.
తెలంగాణ ప్రభుత్వం చేయూత
తెలంగాణ ప్రభుత్వం ఈ సారి రంజాన్ వేడుకలను ప్రత్యక్షంగా నిర్వహిస్తోంది. ఈద్గాలు, మసీదుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ముస్లింల భక్తిలో తాము కూడా భాగస్వాములమేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ముస్లింలతో వేడుకలు నిర్వహించడానికి ముందుకు రావడం గమనార్హం.
అన్ని పండగలను..
తెలంగాణ ప్రభుత్వం దసరా, క్రిస్ మస్, రంజాన్ పండుగలను అధికారికంగా నిర్వహిస్తోంది. ప్రత్యక్షంగా ప్రజలతో కలిసి పండుగలు జరుపుకుంటోంది. తామంతా ఒకటే తమలో వ్యతిరేక భావాలు లేవని తెలియజెప్పేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతోంది. భారత రాజ్యాంగం ప్రకారం హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు అందరు సమానమనే సందేశం ఇస్తోంది.
దానం
ముస్లింలు ఈ పండుగ రోజు తమకు ఉన్న దాంట్లో పేద వారికి దానాలు చేస్తుంటారు. ఇది ఖురాన్ లో కూడా ఉంది. తమ కంటే కిందిస్థాయి వారికి దానం చేయడం వల్ల తమకు ముక్తి కలుగుతుందని వారి నమ్మకం. ఇందులో భాగంగానే పేదలకు డబ్బు, బట్టలు, ఆహారాలు ఇస్తుంటారు. దీంతో అల్లా తమను చల్లగా చూస్తాడని వారి విశ్వాసం.
ఆనందాలకు ప్రతీక
రంజాన్ మాసం ముస్లింలకు ఆనందం నింపే పెద్ద పండుగ. ఈ రోజు ప్రతి ఒక్క ముస్లిం తన ఇంట్లో మంచి బట్టలు, మంచి ఆహారం, అన్ని మంచివే చేస్తుంటారు. ఇంట్లో సందడి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులందరు సంతోషంతో గడుపుతారు. ఇష్టమైన వంటకాలు చేసుకుని పసందైన రీతిలో భోజనాలు చేస్తారు. రంజాన్ రోజు ఎంత పెద్ద ముస్లిం అయినా తమ కుటుంబంతోనే గడపడం గమనార్హం.
మతసామరస్యం
రంజాన్ పండగ రోజు హిందువులు కూడా వారి ఇళ్లకు వెళ్లి ఈద్ ముబారక్ చెబుతారు. పరస్పరం కౌగిలించుకుని శుభాకాంక్షలు చెప్పుకుంటారు. అల్లా అందరిని చల్లగా చూడాలని కోరుకుంటారు. ఇలా మతసామరస్యానికి ప్రతీకగా రంజాన్ నిలుస్తోంది.