Leo Movie Ram Charan: విజయ్ లియో మూవీలో రామ్ చరణ్… లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో మెగా హీరో?

Leo Movie Ram Charan: లోకేష్ కనగరాజ్-విజయ్ మూవీలో రామ్ చరణ్ నటిస్తున్నాడన్న వార్త టాలీవుడ్ ని షేక్ చేస్తుంది. యాక్షన్ క్రైమ్ చిత్రాల దర్శకుడిగా లోకేష్ అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు. లోకేష్ గత చిత్రం విక్రమ్ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఫార్మ్ లో లేని కమల్ హాసన్ తో ఆయన ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. కమల్ ని ఆ ఏజ్ లో ఎలా చూపించాలో అర్థం చేసుకున్న ఏకైక దర్శకుడు. విక్రమ్ ఏకంగా […]

Written By: Shiva, Updated On : February 9, 2023 2:37 pm
Follow us on

Ram Charan, vijay

Leo Movie Ram Charan: లోకేష్ కనగరాజ్-విజయ్ మూవీలో రామ్ చరణ్ నటిస్తున్నాడన్న వార్త టాలీవుడ్ ని షేక్ చేస్తుంది. యాక్షన్ క్రైమ్ చిత్రాల దర్శకుడిగా లోకేష్ అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు. లోకేష్ గత చిత్రం విక్రమ్ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఫార్మ్ లో లేని కమల్ హాసన్ తో ఆయన ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. కమల్ ని ఆ ఏజ్ లో ఎలా చూపించాలో అర్థం చేసుకున్న ఏకైక దర్శకుడు. విక్రమ్ ఏకంగా రూ. 450 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టింది. తెలుగులో కూడా భారీ విజయం నమోదు చేసింది. దీంతో ఆయన నెక్స్ట్ మూవీపై అంచనాలు తారాస్థాయికి చేరాయి.

Also Read: Rakhi Sawant- Adil Khan: ఎఫైర్ పెట్టుకున్నాడని భర్తను అరెస్ట్ చేయించిన హీరోయిన్

విజయ్ 67వ చిత్రం లోకేష్ కనకరాజ్ తో చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. టైటిల్ ప్రకటిస్తూ టీజర్ విడుదల చేశారు. లియో: బ్లడీ స్వీట్ అనే ఊహించని టైటిల్ నిర్ణయించారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో తెరకెక్కుతున్న మూడో చిత్రం లియో. ఖైదీ, విక్రమ్ మిగతా రెండు చిత్రాలు. లియో విడుదల తేదీ కూడా ప్రకటించేశారు. అక్టోబర్ 19న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఇక టైటిల్ ప్రకటన టీజర్ ఓ రేంజ్ లో ఉంది. ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించింది.

ఇదిలా ఉంటే మరో ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. లియో మూవీలో రామ్ చరణ్ నటిస్తున్నారట. ఆయన ఓ కీలక రోల్ చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. లియో ఫస్ట్ టీజర్ లో దీనికి సంబంధించిన హింట్ ఉంది అంటున్నారు. రామ్ చరణ్ ది కీలక పాత్ర కాకపోయినా గెస్ట్ అప్పీరెన్స్ కావచ్చు అంటున్నారు. విక్రమ్ మూవీలో రోలెక్స్ అనే విలన్ గా సూర్యను పరిచయం చేశాడు. ఆ పాత్ర సినిమాకు ఎంత పెద్ద హైలెట్ అయ్యిందో తెలిసిందే. అలాగే రామ్ చరణ్ ను కూడా లియోలో పరిచయం చేయవచ్చు అంటున్నారు.

Lokesh Kanagaraj, Ram Charan

అంటే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కే నెక్స్ట్ మూవీ హీరోగా చరణ్ ని పరిచయం చేసే అవకాశం కలవు. గతంలో రామ్ చరణ్-లోకేష్ కాంబోలో మూవీ అంటూ ప్రచారం జరిగింది. విక్రమ్ సక్సెస్ అనంతరం కమల్ హాసన్, లోకేష్ కనకరాజ్ లను ఇంటికి పిలిచి చిరంజీవి ట్రీట్ ఇచ్చారు. ఆ క్రమంలో చరణ్ తో మూవీ చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారన్న కథనాలు వెలువడ్డాయి. కాబట్టి లియో మూవీలో చరణ్ కనిపిస్తాడనే ఊహాగానాలు కొట్టిపారేయలేం అని కొందరి వాదన. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న చరణ్… ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో సినిమా ప్రకటించారు.

Also Read: Pawan Kalyan: ‘వాలెంటైన్స్ డే’ రోజు ఫ్యాన్స్ కి ఊహించని షాక్ ఇవ్వబోతున్న పవన్ కళ్యాణ్..ఇదెక్కడి ట్విస్ట్ సామీ!

Tags