
Thotakura Benefits: ఆకుకూరల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. కూరగాయలు, ఆకుకూరలు తరచుగా తీసుకుంటే ఎంతో మేలు కలుగుతుంది. కొందరు మాత్రం ఆకుకూరలను తీసుకోవడానికి ఇష్టపడరు. ఆకుకూరల్లో తోటకూర రారాజు. అందులో ఉండే ప్రొటీన్ల గురించి తెలిస్తే మనకు షాకే. అందుకే వారంలో కనీసం మూడు సార్లయినా తోటకూర తినాల్సిందే. దీంతో మన శరీరానికి కావాల్సిన ప్రయోజనాలు చేకూరతాయి. తోటకూర తినడం వల్ల మన దేహానికి మేలు కలుగుతుంది. తోటకూరలో ఉండే గొప్ప గుణాలు తెలిస్తే ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తుంది.
Also Read: Hyper Aadi: పవన్ కళ్యాణ్ కావాలా? ఢీ కావాలా? అని అడిగారు… హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్
తోటకూరలో ఏముంటాయి?
తోటకూర వల్ల ఎంత లాభం? దాని వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి? అనే దానిపై రకరకాల అంచనాలు ఉన్నాయి. రోజు వారీ ఆహారంలో తోటకూర తీసుకుంటే విటమిన్లతో పాటు మెగ్నిషియం, కాల్షియం, పాస్పరస్, జింక్, సెలీనియం, ఐరన్, మాంగనీస్ వంటి ఖనిజ లక్షణాలు ఉన్నాయి. తోటకూర పోషకాల గనిగా అభివర్ణిస్తుంటారు. ఆకుకూరల్లో మేటిగా చెబుతారు. తోటకూర ఎంత తింటే అంత లాభం కలుగుతుంది. తోటకూరలో మనకు ఉపయోగపడే గుణాలు అధికంగా ఉండటంతో దాన్ని తీసుకోవడం ఉత్తమం.
బరువు తగ్గాలనుకునే వారు
అధిక బరువుతో బాధపడేవారు కూడా ఆకుకూరను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. తోటకూర తింటే తొందరగా కడుపు నిండిందనే భావన కలుగుతుంది. దీంతో త్వరగా ఆకలి వేయదు. ఎక్కువగా ఆకలి కాదు. బరువు తగ్గాలనుకునే వారు ఆహారంలో భాగంగా తోటకూరను చేసుకోవడం మంచిదే. ఇటీవల కాలంలో అందరు అధిక బరువుతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో తోటకూర ప్రాధాన్యతను గుర్తించి దాన్ని తినేందుకు ప్రాధాన్యం ఇస్తే మన ఆరోగ్యం బాగు పడుతుంది.
కంటిచూపుకు..
తోటకూరను ఎక్కువగా తీసుకుంటే కంటి జబ్బులకు మంచి మార్గం కనిపిస్తుంది. రేచీకటి సమస్యను దూరం చేస్తుంది. తోటకూరను రోజు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తోటకూరలో ఉండే విటమిన్ ఏ వల్ల కంటి సమస్యలు రాకుండా చేస్తుంది. శరీరంలో ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. దృష్టి లోపాలను నియంత్రిస్తుంది. కళ్ల జబ్బులను కానరాకుండా చేస్తుంది. తోటకూరలో ఉండే పోషకాలతో ఎన్నో రకాల ప్రయోజనాలు దాగి ఉన్నాయి. తోటకూర తింటే మనకు అందే ప్రొటీన్లతో లాభాలు మెండుగా ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు.

ఎముకల దృఢత్వానికి..
తోటకూర ఎముకలు బలంగా ఉండటానికి దోహదం చేస్తుంది. ప్రతిరోజు తోటకూర తినడం వల్ల కాల్షియం ఎముకల బలానికి ఉపయోగపడుతుంది. మోకాళ్ల నొప్పులు, కీళ్లనొప్పులతో బాధపడేవారు ఆహారంగా తీసుకోవడం వల్ల పలు సమస్యల నుంచి బయట పడొచ్చు. తోటకూరను తీసుకోవడం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సాయపడుతుంది. తోటకూరను ఆహారంగా తీసుకుంటే చాలా ప్రయోజనాలు దక్కుతాయనడంలో సందేహం లేదు.
Also Read: Botsa Satyanarayana- Jagan: బొత్సకు భయపడుతున్న జగన్
