Homeట్రెండింగ్ న్యూస్Rahul Gandhi: అమ్మకు ప్రేమతో.. సోనియాకు రాహుల్ ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా

Rahul Gandhi: అమ్మకు ప్రేమతో.. సోనియాకు రాహుల్ ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా

Rahul Gandhi: గోవాకు ఒంటరిగా వెళ్లిన రాహుల్ గాంధీ.. వచ్చేటప్పుడు మాత్రం జంటగా వచ్చారు. తన తల్లి సోనియాగాంధీకి షాక్ ఇచ్చారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పర్యటించడానికి ఇష్టపడుతుంటారు. తరచూ గోవాను సందర్శిస్తుంటారు. ఇటీవల గోవా వెళ్లిన ఆయన అక్కడ ఇద్దరు దంపతులు నిర్వహిస్తున్న కుక్కల పెంపక కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ జాక్ రస్సెల్ టెర్రియర్ జాతికి చెందిన రెండు కుక్క పిల్లలను చూసి మురిసిపోయారు. తన వెంట తీసుకెళ్లేందుకు సిద్ధపడ్డారు.

అందులో ఒక దానిని తన తల్లికి బహుమతిగా ఇచ్చారు. ఆ కుక్క పిల్లను చూసిన సోనియా తెగ ఆనందపడ్డారు. దానితో ఆడుకున్నారు. ఆ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రాహుల్ తన ఆనందం వ్యక్తం చేశారు. అమ్మకి ఒక సర్ప్రైజ్ అంటూ రాహుల్ సోనియాను బయటకు తీసుకురావడంతో వీడియో మొదలవుతుంది. రాహుల్ ఇచ్చిన బాక్స్ తీసి చూసిన సోనియా అందులో బుజ్జి కుక్కపిల్ల ఉండడంతో సంతోషంతో ఉప్పొంగిపోయారు. చాలా క్యూట్ గా ఉందంటూ మురిసిపోయారు. ఇప్పుడు తమ కుటుంబంలోకి మరో సభ్యురాలు వచ్చిందంటూ రాహుల్ చెబుతున్నారు.

ఇప్పటికే ఓ కుక్కపిల్ల సోనియా ఇంట్లో ఉంది. ఇప్పుడు రాహుల్ తెచ్చిన ఈ కుక్కపిల్ల దాంతో ఇట్టే కలిసిపోయింది. దీంతో సోనియా వాటితో ఆడుకుంటున్నారు. కాలక్షేపం చేస్తున్నారు.ప్రస్తుతం రాహుల్ గాంధీ ఇంకా వివాహం చేసుకోని సంగతి తెలిసిందే. తల్లి సోనియా గాంధీ ఒంటరిగా ఫీల్ అవుతుండడంతో రాహుల్ ఈ కుక్క పిల్లలను తెచ్చి.. తల్లికి అప్పగించారని.. తల్లి పై రాహుల్ చూపుతున్న ప్రేమను నెటిజన్లు ఫిదా అవుతున్నారు.’ అమ్మకు ప్రేమతో’ రాహుల్ గాంధీ అంటూ మెచ్చుకుంటున్నారు.

 

Meet Noorie - the newest member of our family! | Rahul Gandhi | World Animal Day

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version