https://oktelugu.com/

గుడ్ న్యూస్: ప్రభాస్ బర్త్ డే 23న ‘రాధేశ్యామ్’ టీజర్?

అక్టోబర్ 23న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు. ఈరోజు కోసం ప్రభాస్ ఫ్యాన్స్ వేయికళ్లతో అత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రభాస్ తో సినిమాలు చేసే నిర్మాతలు అతడిని సర్ ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆ రోజు ప్రభాస్ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేస్తారని తెలియడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. Also Read: చిరంజీవి కోసం వినాయక్ అంతపని చేశాడా? ప్రభాస్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. కరోనాతో ఆగిపోయిన ఈ సినిమా […]

Written By:
  • NARESH
  • , Updated On : October 21, 2020 / 12:57 PM IST
    Follow us on

    అక్టోబర్ 23న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు. ఈరోజు కోసం ప్రభాస్ ఫ్యాన్స్ వేయికళ్లతో అత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రభాస్ తో సినిమాలు చేసే నిర్మాతలు అతడిని సర్ ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆ రోజు ప్రభాస్ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేస్తారని తెలియడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

    Also Read: చిరంజీవి కోసం వినాయక్ అంతపని చేశాడా?

    ప్రభాస్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. కరోనాతో ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మళ్లీ మొదలైంది. ఈ మూవీలో ప్రభాస్ కు జోడిగా బుట్టబొమ్మ పూజహెగ్డే నటిస్తోంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘రాధేశ్యామ్’ టీం ఓ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది.

    ఈ మోషన్ పోస్టర్ కు సంబంధించి నిన్న ఓ ఫస్టు లుక్ విడుదలైంది. అయితే దీనికి కాపీ మరక అంటుకుంది. దీంతో ‘రాధేశ్యామ్’ చిత్రయూనిట్ కాపీ మరకను తొలగించుకునేందుకు యత్నిస్తోంది. ఇందులో భాగంగా మోషన్ పోస్టర్ ను కాస్తా టీజర్ గా మార్చినట్లు తెలుస్తోంది. చూడటానికి మోషన్ పోస్టర్ల ఉన్నప్పటీకి టీజర్ ను తలపించనుంది.

    మోషన్ పోస్టర్ ఆరంభంలోనే ప్రపంచ ప్రఖ్యాత ప్రేమికులుగా జస్ట్ ఎట్ ఎ గ్లాన్స్ పరిచయం చేయనున్నారు.. ఆ తర్వాత సినిమాకు ముఖ్యమైన పామిస్ట్రీ(హస్త సాముద్రికం) సింబాలిక్ గా అరచేతిని చూపింబోతున్నారు. ఆ వెంటనే దూరంగా కొండలు.. ఆపై ఓ రైలు.. ఆ రైలు లోంచి బయటకు ఎగురుతున్న ఒక చున్నీ.. ఆ చున్నీని ఓ చేయి పట్టుకోవడం చూపించనున్నారట.

    ఆ తర్వాత వెంటనే హీరోయిన్ రైలు డోర్ దగ్గరకు వచ్చి ఫోకస్ కావడం.. కట్ చేస్తే ఆ వెంటనే హీరో జైగాంటిక్ పర్సనాలిటీతో ఒక కాలు నేల మీద.. మరో కాలు రైలు మీద వేసి కనిపించడం చూపించనున్నారు. దీంతో మోషన్ పోస్టర్ ఎండ్ అవుతుందని విశ్వసనీయ సమాచారం.

    Also Read: ‘రాధేశ్యామ్’ సర్ ప్రైజ్ వచ్చేసింది.. ప్రభాస్ సీడీపీ వైరల్..

    ఈ మోషన్ పోస్టర్ కు జస్టిస్ ప్రభాకరన్ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చినట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్ వినడానికే అద్భుతంగా ఉంటే చూస్తే ఎలా ఉంటుందోననే చర్చ జోరుగా సాగుతోంది. మరో రెండ్రోజులు ఆగితే ప్రభాస్ ఫ్యాన్స్ ముచ్చట తీరడం ఖాయంగా కన్పిస్తోంది.