కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అని.. చివరకు సొంత పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చని ఘనుడు వైఎస్ జగన్. అతని చరిష్మా గురించి అందరికీ తెలిసిందే. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా 151 సీట్లు సాధించారంటే అతని గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే.. జగన్‌మోహన్‌రెడ్డికి అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటి అంటే.. అందరూ అసెంబ్లీ సీట్లు, ఎంపీ సీట్లు గెలుకోవడమే అని చెబుతారు. అంతకుమించి కేంద్రంతో మంచి సంబంధాలు ఉండటమే అతిపెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పేవాళ్లు కూడా ఉన్నారు. పార్టీపై తిరుగులేని ఆధిపత్యం ఉండటమే అసలైన బలమని కూడా చెబుతుంటారు. ఇవన్నీ కరెక్టే కానీ అసలైన బలం ఏంటంటే మీడియాకు దూరంగా ఉండటమే.
Also Read: పోలవరంపై జగన్‌కు ఝలక్ ఇచ్చిన కేంద్రం!
అవును మరి.. జగన్ ఏ రోజు కూడా పెద్దగా మీడియా ముందుకు వచ్చిన దాఖలాలు కనిపించవు. గత ప్రభుత్వాలు ఏకంగా మీడియానే తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి. కానీ.. జగన్ మాత్రం మీడియాను ఎంత తక్కువ ఉపయోగించుకుంటే అంత మేలని ఆయన ఉద్దేశం. చరిత్రలో మీడియాతో రాసుకుని తిరిగిన వాళ్లలో చాలామంది చివరకు నష్టపోయిన వారే ఉన్నారు. ఇదే సమయంలో మీడియాకు ఎంత దూరంగా ఉంటే అంత లాభం అని జగన్ అభిప్రాయం. మీడియాతో నష్టపోయిన వారిలో వైసీపీ తిరుగుబాటు ఎంపీ కూడా ఉన్నాడు. కారణాలు ఏవైనా పార్టీకి దూరంగా జరిగిన దగ్గర నుండి ఎంపీ అదేపనిగా జగన్ పై నోరుపారేసుకుంటున్నాడు.
అయితే.. ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు స్థాయి లాంటి వ్యక్తి ఆరోపణలు చేస్తే ఎవరైనా ఆ వార్తను ఆసక్తిగా చదువుతారు. కానీ.. జనాలతో పెద్దగా సంబంధాలు మెయింటెన్ చేయని ఓ ఎంపీ వ్యాఖ్యలు చేస్తే ఎవరు పట్టించుకునేది..? అయితే.. తెలిసో తెలీకో లోకేష్ కూడా తండ్రినే ఫాలో అవుతున్నాడు. ప్రతిరోజూ అయినదానికి కానిదానికి జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేయటానికి ట్విట్టర్‌ను వినియోగిస్తున్నాడు.
Also Read: వివేకా హత్య కేసు: బండారం బయటపడుతోందా?
ఇక జగన్ విషయానికి వస్తే స్వతహాగానే మీడియా ఫ్రెండ్లీకాదు. కాబట్టి మీడియా సమావేశాల్లో పాల్గొనాలని జగన్ కు కోరికలేదు. దాదాపు ఏడాదిన్నర క్రితం సీఎంగా బాధ్యతలు తీసుకున్న జగన్ ఇప్పటికీ నిర్వహించిన మీడియా సమావేశాలు మూడంటే మూడే. ఇదే సమయంలో చంద్రబాబు వారానికి దాదాపు నాలుగు రోజులు మీడియా సమావేశాలు పెట్టి జగన్ పై విరుచుకుపడుతుంటారు. మీడియాలో కనిపించాలన్నా ఆశ జగన్‌కు లేకపోవడమే పెద్ద ప్లస్ పాయింటని వైసీపీ నేతలే చెబుతున్నారు.