https://oktelugu.com/

Viral video : ఈ లొల్లి మళ్లీ చూడలేమబ్బా.. అంతరించిపోతున్న కళ.. వైరల్ వీడియో

ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారు ఎంతో కలిసిమెలిసి ఉంటారు. అదే సమయంలో వీరి మధ్య వివాదాలు ఏర్పడితే కొట్టుకునే స్థాయికి వెళ్తారు.

Written By:
  • NARESH
  • , Updated On : October 13, 2023 / 05:30 PM IST
    Follow us on

    Viral video : భారతదేశం అనగానే ఒక ప్రత్యేక జీవన శైలి ఉంటుంది. ఇక్కడ విభిన్న మతాలు, అనేక వర్గాలకు చెందిన ప్రజలు జీవిస్తుంటారు. వీరంతా కలిసి మెలిసి ఉంటారు. కానీ ఒక్కోసందర్భంలో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. దేశంలో ఎక్కువగా కుంటుంబ వ్యవస్థ కనిపిస్తుంది. ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ కలిగిన మనదేశంలో నేటి రోజుల్లో అందరూ విడిపోతున్నారు. ఎవరికి వారు జీవిస్తున్నారు. అయితే కుటుంబం అంతా ఒక్కచోట ఉన్నప్పుడు నిత్యం గొడవలు వస్తుంటాయి. ఇలాంటి సమయంలో వీరి మధ్య వచ్చే మాటలు ఇప్పటి వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి.

    ఉమ్మడి కుటుంబంలో ప్రధానంగా ఆడవాళ్ల మధ్య ఎక్కువగా గొడవలు కనిపిస్తూ ఉంటాయి. అత్తా కోడళ్ల మధ్య అయితే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరుతుంది. అందుకే నేటికాలంలో చాలా మంది పెళ్లయిన కొత్త జంట వేరే ఇంట్లోకాపురం పెడుతుంది. అయితే ఒకే ఇంట్లో ఉన్నవాళ్ల పరిస్థితి వేరే. వీరి ఒక్కోసారి గొడవలు పడినా.. ఆ తరువాత వెంటనే కలిసిపోతారు. అత్తా కోడళ్ల మధ్య పరిస్థితి ఎలా ఉంటుందో కొన్ని సీరియల్స్ వస్తుంటాయి. ఇవి సక్సెస్ అయిన సందర్భాలూ ఉన్నాయి.

    ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారు ఎంతో కలిసిమెలిసి ఉంటారు. అదే సమయంలో వీరి మధ్య వివాదాలు ఏర్పడితే కొట్టుకునే స్థాయికి వెళ్తారు. ముఖ్యంగా ఆడవాళ్ల మధ్య కేవలం తిట్ల వరకే ఉంటాయని అందరికీ తెలుసుసు. కానీ కొన్ని గ్రామాల్లో కొట్టుకునేస్థాయికి వెళ్తుంది. ఇలా కొట్టుకునేవాళ్లు వయసుతో సంబంధం లేకుండా తమ పంతం నెగ్గించుకోవాలన్న పట్టుదలతో ఉంటారు. తమకైమైనా పర్వాలేదు గానీ.. గెలిస్తే చాలని అనుకుంటారు.

    తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలోవైరల్ అవుతోంది. ఇద్దరు వృద్ధులు ముందుగా తిట్ల దండకం మొదలుపెట్టారు. ఆ తరువాత కొట్టుకునే స్థాయిక వెళ్లారు. వారు చూడ్డానికి ముసలోళ్లు అయినా గెలవాలన్న తపన ఇద్దరిపై ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకతను తీసి తన సోషల్ మీడియాలో ఉంచాడు. అయితే నేటి కాలంలో ఇలాంటి సీన్లు తక్కువే. ఎందుకంటే ఇప్పటి లేడీస్ ఎక్కువగా ఇలాంటి గొడవలు పెట్టుకోవడం లేదు. ఈనేపథ్యంలో ఈ ‘కళ అంతరించిపోతుంది’ అని క్యాప్షన్ పెట్టాడు. దీంతో ఈ వీడియోను ఆసక్తిగా చూస్తున్నారు. ఆ కళ ఏంటో మీరు కూడా చూసేయండి..