spot_img
Homeఅంతర్జాతీయంIndus Waters Treaty: సింధు ఒప్పందం కాదు.. నరేంద్ర మోడీకి వాళ్ళు రాసిన లేఖ వెనుక...

Indus Waters Treaty: సింధు ఒప్పందం కాదు.. నరేంద్ర మోడీకి వాళ్ళు రాసిన లేఖ వెనుక పెద్ద కుట్ర

Indus Waters Treaty: ఫరూక్ అబ్దుల్లా.. మహబూబా ముప్తి.. మణి శంకర్ అయ్యర్.. అవతార్ సింగ్ దులత్… పాకిస్తాన్ దేశానికి చెందిన కొంతమంది ప్రముఖులు.. ఇలా మొత్తం 117 మంది ఒక లెటర్ రాశారు. అదికూడా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి.. పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ కు.. ఆ లేఖలో ఏం చెప్పారంటే.. సింధు జలాల ఒప్పందం గురించి మాట్లాడారు. 2004 నుంచి 2007 మధ్య జరిగిన పాత ఒప్పందాల గురించి వారు మాట్లాడారు. ఆ రాసే ఒప్పంద లను తిరిగి అమలు చేయాలని వారు కోరుతున్నారు.

వాస్తవానికి ఈ మేధావులు భారత ప్రధానమంత్రిని కోరుతున్నట్టు కనుక చేస్తే.. ఆర్టికల్ 370 రద్దు వల్ల కలిగిన ప్రయోజనాలను తుడిచి పెట్టడమే అవుతుంది. సరిహద్దులను మార్చాల్సి ఉంటుంది. పాకిస్తాన్ దేశంలో చర్చలు జరపాల్సి ఉంటుంది. వేర్పాటు వాద శక్తులకు అలీ ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంది. ఇది దేశ భద్రతకు అత్యంత ప్రమాదకరం. వాస్తవానికి ఆ వ్యక్తులు ఒక వ్యవస్థీకృత ఎకో సిస్టం లాగా ఏర్పడ్డారు. మోడీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోనట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి మారిపోతుంది. అభివృద్ధి వేగంగా సాగిపోతోంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరా జరుగుతుంది. హైవేలు ఏర్పడ్డాయి. ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు జరిగాయి. అక్కడ ఒక ప్రభుత్వం ఏర్పడింది. ఇంకా చెప్పాలంటే లాల్ చౌక్ ప్రాంతంలో జాతీయ జెండా ఎగిరింది. జమ్ము కాశ్మీర్లో ఒకప్పటిలాగా సీమాంతర ఉగ్రవాదం లేదు. చొరబాట్లు లేవు. నకిలీ కరెన్సీ సర్కులేషన్ లేదు. పాకిస్తాన్ ఒక అడుగు ముందుకేస్తే.. ఇండియన్ ఆర్మీ 100 అడుగులు ముందుకేస్తోంది. అలాంటప్పుడు ఏకంగా 117 మంది ప్రముఖులు భారత ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయడం.. సింధు నది జలాల ఒప్పందాన్ని గురించి ప్రస్తావించడం అంటే.. ఆర్టికల్ 370 ని మళ్ళీ అమలు చేయాలని కోరడమే.. మరి దీనిపై నరేంద్ర మోడీ ఏ నిర్ణయం తీసుకుంటారు.. ఆ 117 మంది ఉదార వాదులకు ఎలాంటి సమాధానం చెప్తారో చూడాల్సి ఉంది.

ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత సింధు నది విషయంలో చాలావరకు కఠిన విధానాలకు పాల్పడుతుంది. నీటి కేటాయింపుల విషయంలో పాకిస్తాన్ దేశానికి అంతగా సహకరించడం లేదు. పైగా ఎక్కడికక్కడ చెక్ డ్యాం లు నిర్మిస్తోంది.. ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తోంది. జమ్ము కాశ్మీర్ మీదుగా ఈశాన్య రాష్ట్రాలకు నీటిని తరలిస్తోంది. అలాంటప్పుడు పాకిస్తాన్ దేశం ఎడారిగా మారిపోతుందని అక్కడి ప్రజలు బాధపడుతున్నారు. ఉగ్రవాదులతో స్నేహం చేసే దేశానికి నీళ్లు ఇచ్చేది లేదని భారత్ స్పష్టం చేస్తోంది. ఇలాంటి క్రమంలో కొంతమంది ప్రధానమంత్రి లేఖ రాయడం.. అందులో పాకిస్తాన్ వాళ్ళు కూడా ఉండడం.. దీనిని మనదేశంలో ఒక వర్గం మీడియా హైలెట్ చేయడం.. రకరకాల అనుమానాలకు కారణమవుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version