Site icon OkTelugu

South Africa Semi Final Loss: దరిద్రం వైఫై లాగా ఉంటే.. దక్షిణాఫ్రికా ఏం బాగుపడుతుంది.. పాపం.. ఈ కష్టం పగోడికీ రావద్దు..

South Africa Semi Final Loss

South Africa Semi Final Loss

South Africa Semi Final Loss: ఇటీవల జరిగిన ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా జట్టు అడుగు పెట్టింది. టీమ్ ఇండియాతో ట్రోఫీ కోసం పోరాడింది. చివరి వరకు మైదానంలో తలపడింది. ఒక దశలో ట్రోఫీకి దగ్గరగా వచ్చింది. కానీ అదృష్టం ఎదురు కావడంతో ఓడిపోయింది..

కేవలం మహిళల జట్టు మాత్రమే కాదు.. పురుషుల జట్టు పరిస్థితి కూడా అదే. దక్షిణాఫ్రికాలో అద్భుతమైన ప్లేయర్లు ఉన్నప్పటికీ.. పోరాట స్ఫూర్తిని ప్రదర్శించే వాళ్ళు ఉన్నప్పటికీ.. 2025లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ మినహా.. ఇంతవరకు ఐసీసీ నిర్వహించే మేజర్ టోర్నీలో కూడా ట్రోఫీ అందుకోలేకపోయింది. ఫైనల్ కు దగ్గర రావడం అందులో ఓడిపోవడం.. సెమీఫైనల్ దాకా రావడం అందులో ఓడిపోవడం.. సంవత్సరాలుగా దక్షిణాఫ్రికా జట్టు పరిస్థితి ఇలానే ఉంది.

కేవలం పురుషులే కాదు.. మహిళల పరిస్థితి కూడా అలానే ఉంది. ఇటీవలి వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయిన దక్షిణాఫ్రికా జట్టు.. తాజా టి20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. ఇలా ఓడిపోవడం దక్షిణాఫ్రికా జట్టుకు తొలిసారి కాకపోయినప్పటికీ.. ట్రోఫీ అందుకునే క్రమంలో ఇలా ఒత్తిడికి గురి కావడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది.

దక్షిణాఫ్రికా జట్టులో లారా, బ్రిడ్స్,. డెర్క్ సన్, కాప్, లూస్, క్లర్క్, ట్రయాన్, జఫ్టా, కాక.. ఇస్మాయిల్ వంటి ప్లేయర్లు ఉన్నప్పటికీ సెమీఫైనల్ లో ఒత్తిడికి గురికాక తప్పలేదు. బ్రిడ్స్ హాఫ్ సెంచరీ చేసినప్పటికీ.. మిగతా ప్లేయర్లు విఫలమయ్యారు. ఫలితంగా ఇంగ్లాండ్ విధించిన 170 పరుగుల టార్గెట్ ను దక్షిణాఫ్రికా మహిళలు ఫినిష్ చేయలేకపోయారు. 20 ఓవర్లు పూర్తిస్థాయిలో ఆడినప్పటికీ కేవలం 129 పరుగుల వద్ద ఆగిపోయారు. 40 పరుగుల తేడాతో ఓడిపోవడం మాత్రమే కాదు.. మరోసారి తమది అత్యంత దురదృష్టకరమైన జట్టు అని నిరూపించుకున్నారు. సంవత్సరాల సంవత్సరాలుగా దక్షిణాఫ్రికా జట్టు పరిస్థితి ఇలానే ఉండడంతో ఆ జట్టు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ జన్మలో తమ జట్టు బాగుపడదా అంటూ సోషల్ మీడియాలో నిర్వేదాన్ని ప్రకటిస్తున్నారు.

Exit mobile version