Puri Jagannath : సినిమాలకు గుడ్ బై చెప్పేసి సరికొత్త జీవితాన్ని ప్రారంభించిన పూరి జగన్నాథ్

Puri Jagannath : తెలుగు కమర్షియల్ సినిమాని సరికొత్త పుంతలు తొక్కించిన డైరెక్టర్స్ లో ఒకరు పూరి జగన్నాథ్.ఈయన సినిమాలోని హీరో క్యారెక్టర్స్ హీరోయిజమ్ కి పెట్టింది పేరులాగా ఉంటుంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి సినిమాతో ప్రారంభమైన పూరి జగన్నాథ్ కెరీర్, సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేసిన పోకిరి సినిమాతో నెంబర్ 1 స్థానం కి ఎగబాకింది.అప్పట్లో దర్శక ధీరుడు రాజమౌళి కూడా పూరి జగన్నాథ్ రికార్డ్స్ ని కొట్టడానికి చాలా కష్టపడేవాడు.అలాంటి పూరి […]

Written By: NARESH, Updated On : March 9, 2023 10:29 pm
Follow us on

Puri Jagannath : తెలుగు కమర్షియల్ సినిమాని సరికొత్త పుంతలు తొక్కించిన డైరెక్టర్స్ లో ఒకరు పూరి జగన్నాథ్.ఈయన సినిమాలోని హీరో క్యారెక్టర్స్ హీరోయిజమ్ కి పెట్టింది పేరులాగా ఉంటుంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి సినిమాతో ప్రారంభమైన పూరి జగన్నాథ్ కెరీర్, సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేసిన పోకిరి సినిమాతో నెంబర్ 1 స్థానం కి ఎగబాకింది.అప్పట్లో దర్శక ధీరుడు రాజమౌళి కూడా పూరి జగన్నాథ్ రికార్డ్స్ ని కొట్టడానికి చాలా కష్టపడేవాడు.అలాంటి పూరి జగన్నాథ్ తో ఇప్పుడు హీరోలు సినిమాలు చెయ్యడానికే వణికిపోతున్నారు.

ఆయన లేటెస్ట్ చిత్రం లైగర్ ఫలితం అలాంటిది మరీ.పూరి జగన్నాథ్ కి ఫ్లాప్స్,డిజాస్టర్స్ కొత్తేమి కాదు.కానీ ఈ లైగర్ సినిమా అనేది ఆయన దర్శకత్వ ప్రతిభని ప్రశ్నించేలా చేసింది.గతం లో ఆయన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కానీ, అది జనాలు వివిధ కోణాల్లో చూడడం వాళ్ళ డివైడ్ రెస్పాన్స్ వచ్చిందే తప్ప డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ ఫెయిల్ అవ్వలేదు.

కానీ లైగర్ సినిమా తో ఆయన డైరెక్షన్ లో ఫెయిల్ అవ్వడం కాదు, ఏకంగా డిజాస్టర్ అయ్యాడు.అసలు ఈ సినిమాకి డైరెక్టర్ నిజంగా పూరి జగన్నాథ్ యేనా అనే అనుమానం అందరిలో కలిగించేలా చేసాడు ఈ చిత్రంతో.దీనితో ఆయన దర్సకత్వం లో నటించడానికి స్టార్ హీరోల సంగతి పక్కన పెట్టు, చిన్న హీరోలు కూడా భయపడిపోతున్నారు.రీసెంట్ గానే చిరంజీవి తో పూరి జగన్నాథ్ ఒక సినిమా చెయ్యబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి, కానీ ఫైనల్ స్టోరీ డిస్కషన్స్ లో చిరంజీవికి నచ్చినట్టు లేదు, అందుకే ఇక సినిమాలకు దర్శకత్వం వహించే బాధ్యత నుండి పూర్తిగా తప్పుకొని, నటుడిగా ఇండస్ట్రీ లో కొనసాగిపోవడానికి సిద్ధం అవుతున్నాడు పూరి జగన్నాథ్.

గత ఏడాదే ఆయన మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించి మంచి గుర్తింపుని తెచ్చుకున్న పూరి జగన్నాథ్, ఇక నుండి కూడా అలాంటి రోల్స్ తోనే ముందుకు తన కెరీర్ ని సాగించాలని చూస్తున్నాడట.చూడాలి మరి పూరి జగన్నాథ్ కి ఎలాంటి రోల్స్ వస్తాయో అనేది.