Prabhas- Kriti Sanon: టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరైనా ఉన్నారా అంటే అది యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మాత్రమే నాలుగు పదుల వయస్సు వచ్చినా కూడా ఇప్పటి వరకు ఆయన పెళ్లి చేసుకోలేదు..ప్రతి ఏడాది ఈ సంవత్సరం కచ్చితంగా అయిపోతుంది అని చెప్తూ వచ్చాడు కానీ పెళ్లి మాత్రం జరగలేదు..అయితే కొన్నేళ్ల పాటు ఆయన ప్రముఖ హీరోయిన్ అనుష్క శెట్టి తో ప్రేమలో ఉన్నాడని.

ప్రస్తుతం వీళ్లిద్దరు డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి..కానీ అవన్నీ నిజం కాదని ఇద్దరూ ఖండించారు..ఈమధ్య కాలం లో ఆది పురుష్ మూవీ హీరోయిన్ కృతి సనన్ తో ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే నిశ్చితార్థం అంటూ వార్తలు వచ్చాయి..అయితే కృతి సనన్ సోషల్ మీడియా ద్వారా అలాంటిది ఏమి లేదంటూ చెప్పుకొచ్చింది..కానీ రీసెంట్ గా సోషల్ మీడియా లో వీళ్లిద్దరి గురించి వినిపిస్తున్న ఒక వార్త మాత్రం హాట్ టాపిక్ గా మారింది..అదేంటో ఇప్పుడు మనం చూద్దాము.
ఈమధ్యనే ప్రభాస్ కృతి సనన్ కి 17 లక్షల రూపాయిలు విలువ చేసే జీన్స్ ప్యాంట్ ని గిఫ్ట్ గా ఇచ్చాడట..ఆ జీన్స్ ప్యాంట్ చూస్తే ఆశ్చర్యపోక తప్పదు..మొత్తం చిరిగిపోయినట్టు కనిపిస్తున్న ఆ ప్యాంట్ ని చూస్తే ఇది 17 లక్షలేంటి..మన ఇంట్లో ఉన్న జీన్స్ ప్యాంట్ ని చింపుకొని వేసుకుంటే ఇలాగే ఉంటాది కదా..అందులో స్పెషలిటీ ఏముంది అని అనిపించొచ్చు..కానీ ఈమధ్య సెలెబ్రిటీలు వాడే దుస్తులన్నీ అలాగే ఉన్నాయిమరీ..ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన ఈ ప్యాంట్ గురించే మాట్లాడుకుంటున్నారు.

ఇక ప్రభాస్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆయన ఒకేసారి సలార్, రాజా డీలక్స్ మరియు ప్రాజెక్ట్ K సినిమాల్లో సమాంతరంగా నటిస్తున్నాడు..ఈ చిత్రాల షూటింగ్స్ శరవేగంగా సాగుతున్నాయి..మరో పక్క ఆది పురుష్ మూవీ షూటింగ్ అయిపోయింది..గ్రాఫిక్స్ వర్క్ జరుగుతున్నాయి..ఈ మూడు సినిమాలు వచ్చే ఏడాదిలోనే విడుదల కాబోతున్నాయి.