ఆవు పేడతో లక్షల్లో ఆదాయం పొందే అవకాశం.. ఎలా అంటే..?

సాధారణంగా ఎవరైనా ఆవు పేడ ద్వారా డబ్బులు సంపాదించవచ్చని చెబితే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అయితే దేశంలో వేల సంఖ్యలో మహిళలు ఆవు పేడ ద్వారా లక్షల్లో సంపాదిస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా దేశంలో ఆవుపేడకు రోజురోజుకు డిమాండ్ ఊహించని స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం. ఆవుపేడతో మహిళలు పిడకలతో పాటు రకరకాల ఉత్పత్తులను కూడా తయారు చేస్తుండటం గమనార్హం. ఛత్తీస్ గఢ్ మహిళలు ఆవుపేడను ఆదాయవనరుగా మార్చుకుని ఎన్నో రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఆ ఉత్పత్తులను […]

Written By: Kusuma Aggunna, Updated On : August 12, 2021 5:57 pm
Follow us on

సాధారణంగా ఎవరైనా ఆవు పేడ ద్వారా డబ్బులు సంపాదించవచ్చని చెబితే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అయితే దేశంలో వేల సంఖ్యలో మహిళలు ఆవు పేడ ద్వారా లక్షల్లో సంపాదిస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా దేశంలో ఆవుపేడకు రోజురోజుకు డిమాండ్ ఊహించని స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం. ఆవుపేడతో మహిళలు పిడకలతో పాటు రకరకాల ఉత్పత్తులను కూడా తయారు చేస్తుండటం గమనార్హం.

ఛత్తీస్ గఢ్ మహిళలు ఆవుపేడను ఆదాయవనరుగా మార్చుకుని ఎన్నో రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఆ ఉత్పత్తులను అమ్ముతూ లక్షల్లో ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం ఒకప్పుడు మావోయిస్టుల తుపాకుల మోతలతో ఎక్కువగా వార్తల్లో నిలిచేది. ప్రస్తుతం ఛత్తీస్ గఢ్ దేశంలోని ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలవడం గమనార్హం.

ఛత్తీస్ గఢ్ లోని తహ్‌షిల్, గుమ్కా, సింఘాల, తెందెసాల్‌ ప్రాంతాల మహిళలు ఆవు పేడను ఆదాయ వనరుగా మార్చుకున్నారు. గ్రామాలలో నివశించే మహిళలు స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి ఆవుపేడ సహాయంతో నర్సరీ పాట్స్ తో పాటు మొబైల్‌ ఫోన్‌స్టాండ్లు, పిడకలు, విగ్రహాలు తయారు చేస్తున్నారు. అలా తయారు చేసిన ఉత్పత్తులను ఈ కామర్స్ వెబ్ సైట్ల ద్వారా విక్రయిస్తున్నారు.

ఆవుపేడతో వ్యాపారమా అని ఒకప్పుడు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన వాళ్లు ప్రస్తుతం ఆవు పేడ లక్ష్మీదేవి అని అభిప్రాయపడుతున్నారు. ఆవుపేడ ఉత్పత్తులను అమ్మి లక్షల్లో సంపాదించిన మహిళలు కూడా ఉన్నారు. అపర్ణ అనే అడ్వకేట్ ఆవు పేడ ద్వారా లాయర్ గా సంపాదించిన మొత్తం కంటే ఎక్కువ మొత్తం పొందుతున్నానని చెబుతుండటం గమనార్హం.