బన్నీ పై క్రష్‌ అట.. విజయ్ దేవరకొండ చిల్ అట !

‘ప్రియాంక జవాల్కర్‌’ అచ్చ తెలుగు హీరోయిన్. ఐతే, మన తెలుగు అమ్మాయి కావడం వల్లే అమ్మడుకి అవకాశాలు రావడం లేదు అని ఓ అపవాదు ఉన్నప్పటికీ.. ఈ భామ మాత్రం చక్కగా నటిస్తోంది. ఇప్పటికే మంచి నటి అనిపించుకుంది. కాకపోతే హీరోయిన్ రేంజ్ గ్లామర్ ఆమెలో లేదు అని, అన్నిటికీ మించి బరువు కూడా బాగా పెరిగిపోయిందని ఈ మధ్య తరుచూ ఆమె పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. టాలీవుడ్‌ లో ఈ బ్యూటీ హీరోయిన్‌ గా […]

Written By: admin, Updated On : August 12, 2021 5:59 pm
Follow us on

‘ప్రియాంక జవాల్కర్‌’ అచ్చ తెలుగు హీరోయిన్. ఐతే, మన తెలుగు అమ్మాయి కావడం వల్లే అమ్మడుకి అవకాశాలు రావడం లేదు అని ఓ అపవాదు ఉన్నప్పటికీ.. ఈ భామ మాత్రం చక్కగా నటిస్తోంది. ఇప్పటికే మంచి నటి అనిపించుకుంది. కాకపోతే హీరోయిన్ రేంజ్ గ్లామర్ ఆమెలో లేదు అని, అన్నిటికీ మించి బరువు కూడా బాగా పెరిగిపోయిందని ఈ మధ్య తరుచూ ఆమె పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

టాలీవుడ్‌ లో ఈ బ్యూటీ హీరోయిన్‌ గా రాణించడం కష్టం అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా వరుస ఛాన్స్ లను అందుకుని హీరోయిన్ గా ఈ నెలలో రెండు విజయాలను తన ఖాతాలో వేసుకుంది. తిమ్మరుసు, ఎస్ ఆర్‌ కళ్యాణ మండపం సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రియాంక చేతిలో ప్రస్తుతం మరో తమిళ సినిమా కూడా ఉంది.

అలాగే ఆనంద్ దేవరకొండ సినిమాలో కూడా ఈ భామ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ.. బన్నీ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తనకు హీరో అల్లు అర్జున్‌ అంటే విపరీతమైన ఇష్టం అని, ముఖ్యంగా బన్నీ స్టైల్ ను చాలా ఇష్టపడతాను అని, ఎప్పటికైనా బన్నీతో కలిసి నటించాలని ఉందని ప్రియాంక చెప్పుకొచ్చింది.

పైగా అల్లు అర్జున్ పై ఎప్పటి నుండో తనకు క్రష్‌ ఉంది అని కూడా ప్రియాంక తెలిపింది. అయినా ఉన్నట్టు ఉంది. ‘ప్రియాంక జవాల్కర్‌’ అల్లు అర్జున్ పై ఎందుకు పొగడ్తల వర్షం కురిపిస్తోంది ? అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమెనే క్వశ్చన్ చేస్తున్నారు. ఇక పనిలో పనిగా ప్రియాంక, విజయ్‌ దేవరకొండను కూడా పొగడుతూ.. విజయ్ ఎప్పుడు చిల్‌ గా ఉంటాడని, తనను ఎప్పుడూ ఇష్టపడుతూనే ఉంటాను అని ఆమె చెప్పుకొచ్చింది.