Homeఅంతర్జాతీయంChina Lady AI Robot Maya: చైనా సంచలనం : లేడీ ఏఐ రోబోట్‌...

China Lady AI Robot Maya: చైనా సంచలనం : లేడీ ఏఐ రోబోట్‌ తయారీ.. అన్ని పనులు చేసుకోవచ్చట

China Lady AI Robot Maya:  రోబో.. మర మనిషి.. దశాబ్దాల క్రితమే వీటి తయారీ మొదలైంది. అయితే పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా రోబోల తయారీలో అప్‌డేట్‌ అవుతున్నాయి. ఇక రోబోల తయారీకి పెట్టింది పేరు చైనా, జపాన్, తైవాన్‌ తదితర దేశాలు. ఎలక్ట్రానిక్స్‌ రంగంలో దూసుకుపోతున్న ఈ దేశాలు ప్రస్తుత ఏఐని అందిపుచ్చుకుని రోబోల తయారీలో వినియోగిస్తున్నాయి. తాజాగా చైనా ఒక అద్భుతం చేసింది. ఏకంగా మహిళా ఏఐ రోబోను తయారు చేసింది. మనిషికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్న ఈ రోబోతో అన్ని పనులు చేసుకోవచ్చట.
బయోమిమెటిక్‌ అద్భుతం..
షంఘైలో చైనా స్టార్టప్‌ DroidUp విడుదల చేసిన మాయా రోబోట్, ప్రపంచంలో మొదటి పూర్తి జీవ సారూప్య ఏఐ మానవుడిగా విజయవంతమైంది. మానవ చర్మం, కదలికలు, భాషా స్పందనలను అనుకరించే ఈ ఆవిష్కరణ, ఇంటి పనులు, సేవలు అందించడంలో పరిపూర్ణతను చూపిస్తుంది. ఈ రోబోట్‌ భవిష్యత్‌ జీవనశైలికి మార్గదర్శకంగా నిలుస్తూ, చైనా సాంకేతిక ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.
భావోద్వేగాలకు అనుగుణంగా..
మాయా, అధునాతన ఏఐ అల్గారిథమ్‌లతో మానవ భావోద్వేగాలను గుర్తించి, సహజంగా సంభాషించగలదు. ఇంటి సహాయం, రొటీన్‌ సహాయాలు నుంచి క్లయింట్‌ సేవల వరకు అన్ని బాధ్యతలు నిర్వహిస్తుంది. బయోమిమెట్రిక్‌ డిజైన్‌తో ముట్టుకుంటే మనిషి షరీరాన్ని ముట్టుకున్నట్లే అనిపించే తీరుగా ఈ రోబో ఉంది. వృద్ధుల సంరక్షణ, ఆసుపత్రుల్లో సేవలను సమర్థవంతంగా నిర్వహిస్తాయి. అంటే నర్సుల స్థానాన్ని భర్తీ చేస్తాయి.
ఉపాధి, ఆర్థిక మార్పులు
చైనా ఈ ఆవిష్కరణతో గ్లోబల్‌ రోబోటిక్స్‌ మార్కెట్‌లో ఆధిపత్యం సాధిస్తోంది. అయితే, సరసరా పనుల్లో మానవుల ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉంది, మరోవైపు కొత్త టెక్‌ ఉద్యోగాలు పెరుగుతాయి. భారత్‌ వంటి దేశాల్లో ఇలాంటి రోబోలు ఇంటి పని, వృద్ధుల సంరక్షణ కోసం సహాయ పడుతుంది. ఇక ఆర్థికంగా చైనా ఎక్స్‌పోర్ట్‌లు పెరిగి, టెక్‌ రేస్‌లో ముందుంటుంది.
మాయ వంటి రోబోలు సాధారణీకరణకు దశలు పెడుతూ డేటా గోప్యత, నైతికత వంటి సమస్యలను లేవనెత్తుతాయి. ప్రభుత్వాలు రెగ్యులేషన్లు రూపొందించాల్సిన అవసరం ఉంది. దీర్ఘకాలంలో ఇది మానవ–రోబో సహజీవనానికి మార్గం సుగమం చేస్తుంది.
Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version