Homeఆంధ్రప్రదేశ్‌Kurnool Real Estate: రాయల్ సీమ.. కోట్ల మాటే.. భవిష్యత్తులో అందుకోవడం కష్టమే..

Kurnool Real Estate: రాయల్ సీమ.. కోట్ల మాటే.. భవిష్యత్తులో అందుకోవడం కష్టమే..

Kurnool Real Estate: కరువు కాటకాలు.. దారుణాలు.. ఫ్యాక్షన్ రాజకీయాలు.. రాయలసీమ అంటే ఇది కాదని.. పంట కాలువలు.. పచ్చటి పొలాలు.. పరిశ్రమలు.. ఉపాధి అవకాశాలు.. స్థిరాస్తి వ్యాపారాలు అని కొత్త అర్థం చెబుతోంది కూటమి ప్రభుత్వం. రాయలసీమ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేస్తోంది. ఏకంగా రాయల్ సీమ అనే అర్ధాన్ని తీసుకొస్తోంది.

రాయలసీమలో కర్నూలు పారిశ్రామిక.. పరిపాలన కేంద్రంగా ప్రస్తుతం కొనసాగుతోంది. దీనికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరికొత్త హంగులు అద్దింది. కర్నూలు నగరంలో.. జిల్లా వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం భారీగా రూపొందుతుంది. 2019 నుంచి 24 వరకు ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం అంత గొప్పగా లేదు. మొత్తం స్తబ్దంగా మారిపోయింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొత్త కొత్తగా ప్రాజెక్టులను తీసుకురావడం.. మౌలిక సదుపాయాల విస్తరణకు కృషి చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.

కర్నూల్ నగర పరిధిలో ఉన్న అనేక ప్రాంతాలలో ఓపెన్ ప్లాట్లు.. గేటెడ్ కమ్యూనిటీ లేఔట్లకు ఒకసారి గా డిమాండ్ పెరిగిపోయింది. అంతేకాదు.. భవిష్యత్ కాలంలో కూడా ఇదే జోరు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా జగన్నాథ గట్టు ప్రాంతంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కాబోతోంది. నేషనల్ లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల విస్తరణకు కీలక అడుగులు పడ్డాయి. దీంతో ఈ ప్రాంత ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వ కార్యాలయాలు.. విద్యాసంస్థలు ఒకే చోట ఏర్పాటు కాబోతున్నాయి. దీంతో జగన్నాథ గట్టు చుట్టుపక్కల ఉన్న భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. రెసిడెన్షియల్ ప్లాట్లు.. కమర్షియల్ ల్యాండ్స్ కు గిరాకీ విపరీతంగా ఉంది.

కర్నూలు ప్రాంతానికి చెందిన వారు మాత్రమే కాకుండా.. ఇతర ప్రాంతాల వారు కూడా ఇక్కడ భూముల మీద విపరీతంగా పెట్టుబడులు పెడుతున్నారు. కర్నూల్ నగరంలో పెద్దగా కాలుష్యం ఉండదు. ప్రశాంతమైన వాతావరణ ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలు ఏర్పాటు అవుతాయి. లోకల్ ఇన్వెస్టర్లు మాత్రమే కాకుండా.. నంద్యాల.. అనంతపురం.. చిత్తూరు ప్రాంతానికి చెందిన వారంతా ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. ఇదే సమయంలో అనధికారిక లేఔట్లలో భూములు కొనుగోలు చేయకూడదని.. చట్టబద్ధమైన భూములను మాత్రమే కొనుగోలు చేయాలని రియల్ ఎస్టేట్ నిపుణులు సూచిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version