https://oktelugu.com/

Viral Video: సిపిఆర్ చేసి పామును బతికించిన పోలీస్ ఆఫీసర్…వీడియో వైరల్….

మనుషుల మధ్య మాత్రమే ఈ సిపిఆర్ లు చేస్తే మనుషులు బ్రతుకుతారు అని మనం అనుకుంటాం కానీ సిపిఆర్ అనేది పాములకు చేసిన పాములు కూడా బ్రతుకుతాయి అనేది మాత్రం ఇప్పుడే తెలిసింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 26, 2023 5:03 pm
    Viral Video

    Viral Video

    Follow us on

    Viral Video: సాధారణంగా ఒక మనిషి చావు బ్రతుకుల మధ్య ఉంటే అతన్ని చూసిన కొంత మంది మనుషులు ఆయన్ని బతికించడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.ఇక ముఖ్యంగా సిపిఆర్ చేయడం వల్ల చాలాసార్లు చాలా మంది బతకడం కూడా మనం చూసాం…

    అయితే మనుషుల మధ్య మాత్రమే ఈ సిపిఆర్ లు చేస్తే మనుషులు బ్రతుకుతారు అని మనం అనుకుంటాం కానీ సిపిఆర్ అనేది పాములకు చేసిన పాములు కూడా బ్రతుకుతాయి అనేది మాత్రం ఇప్పుడే తెలిసింది.ఇక ఈ న్యూస్ తెలుసుకున్న జనాలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అసలు విషయానికి వస్తే మధ్యప్రదేశ్ కి చెందిన ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆయన వెళుతున్న దారి లో ఒక పాము క్రిమిసంహారక మందుని కలిపిన నీటిని తాగి అపస్మారక స్థితిలోకి వెళ్తున్న క్రమంలో ఆ పామును చూసిన పోలీస్ ఆఫీసర్ దానికి సిపిఆర్ చేశాడు.

    అంటే పాము నోట్లో నోరు పెట్టి దానికి శ్వాసను అందించాడు.ఇక సిపిఆర్ ఎందుకు చేస్తారు అంటే ఒక మనిషి కి ప్రమాదం జరిగినపుడు గుండె కొట్టుకోకుండా ఆగిపోయిన పరిస్థితిలో దానికి కృత్రిమంగా నోటి ద్వారా శ్వాసను అందించి చెస్ట్ పైన ప్రెస్ చేస్తూ ఉంటే ఆ గాలికి ఆ ఆగిపోయిన గుండె అనేది ఆక్టివేట్ అయి మళ్లీ యధావిధిగా పనిచేస్తుంది.ఇక ఇలాంటి క్రమంలో ఒక మనిషి మళ్లీ బ్రతకడం జరుగుతుంది. ఇలాంటి కేసులను మనం చాలా సార్లు చూసాం ఇక్కడ కూడా సిపిఆర్ చేసిన తర్వాత ఆ పాము అనేది స్పృహ లోకి రావడం జరిగింది.దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ పాముని పక్కనే వదిలేసి రావడం జరిగింది.

    ఇక దీనంతటిని పక్కనే ఉన్న ఒక వ్యక్తి సెల్ ఫోన్ లో వీడియోగా రికార్డ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది. దాని ద్వారా ఆ వీడియోని చాలామంది చూసి ఒక పోలీస్ ఆఫీసర్ సిపిఆర్ చేసి పాము ను బతికించడం అనేది చాలా గ్రేట్ అంటూ ఆయన్ని పొగుడుతున్నారు. అలాగే మరికొంతమంది మాత్రం కొంచెం అజాగ్రత్తగా ఉంటే ఆ పాము మళ్లీ స్పృహలోకి వచ్చిన తర్వాత ఆయననే కాటేసే పరిస్థితులు కూడా లేకపోలేదు అందుకే పాములతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది అంటూ అతన్ని మెచ్చుకుంటూనే అతనికి కొన్ని జాగ్రత్తలను తెలియజేశారు. ఇక ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవడంతో ఆ వీడియోలో ఉన్న కానిస్టేబుల్ పేరు అతుల్ శర్మగా గుర్తించారు…