Mahesh Babu: తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు మహేష్ బాబు. బాలనటుడిగానే తన సత్తా చాటిన ఈ హీరో స్టార్ హీరోల లిస్ట్ లో చేరాడు. మంచితనం, కూల్, హాండ్ సమ్ కు పెట్టింది పేరుగా నిలుస్తుంటారు కూడా. ఈయన సినిమా కెరీర్ ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో.. అదే రేంజ్ లో వ్యక్తిగత జీవితం కూడా సక్సెస్ అయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న మహేష్ భర్తగా, తండ్రిగా అన్ని బాధ్యతలు తీర్చడంలో సఫలం అయ్యారు. ఇక ఈయన మంచితనానికి అయితే కొదువ లేదనే చెప్పాలి. అసలు ఇప్పుడు ఈ విషయం ఎందుకు అనుకుంటున్నారా. అన్ని గుడ్ క్వాలిటీస్ గురించి మాట్లాడుకుంటున్నామ్.. మరి మహేష్ కి కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా? అయితే ఇది చదివేసేయండి…
ప్రతి మనిషికి ఏదో ఒక సందర్బంగా కోపం, చిరాకు, ఒత్తిడి అనేవి రావడం కామన్. ఈ విధంగా మహేష్ బాబుకు చాలా సందర్భాలలో స్ట్రెస్ ఫీలవుతారట. ఈ సమయంలో మహేష్ ఫ్యామిలీతో ట్రిప్ ప్లాన్ చేస్తారట. సహజంగా ఇతరులకు కోపం వస్తే.. బయటకు వెళ్లడం, మందు కొట్టడం, లేదా గొడవ పడడం చేస్తుంటారు. కానీ మహేష్ బాబు అలా కాదట.. కేవలం ఫ్యామిలీతో బయటకు వెళ్తారట. కానీ ఇతరుల మీద కోపం చూపించడం, ఇంట్లో గొడవ పెట్టుకోవడం చేయరట సూపర్ స్టార్ తనయుడు.
కోపం నుంచి బయటపడటానికి అలాగే తన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఈయన ఫ్యామిలీతో కలిసి ట్రిప్ వెళతారని, ఇక తాను అధికంగా ఒత్తిడికి గురైతే కనక ఒంటరిగా ట్రిప్ వెళ్తూ తన మనసును ప్రశాంతంగా ఉంచుకుంటారని తెలుస్తోంది. తన కోపాన్ని ఇతరులు పట్ల చూపించకుండా మహేష్ బాబు ఏంచక్కా ఫ్లైట్ ఎక్కి వేరే దేశానికి వెళ్లిపోతారన్నమాట. ఇక మహేష్ ఇలా చేస్తారు అని తెలియగానే.. వావ్ మంచి ఆలోచన గొడవ పడకుండా ఫ్యామిలీతో సమయం గడపడం చాలా మంచి లక్షణం. ఒక్కరు వెళ్లినా కూడా కోపం కంట్రోల్ అవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది కానీ గొడవలు, ఆరోగ్య సమస్యలు రావు కదా.. అందుకే అందరూ కూడా ఇలాంటి మార్గం ఎంచుకుంటే బాగుంటుంది అంటున్నారు మహేష్ బాబు అభిమానులు.
ఇదిలా ఉంటే మహేష్ బాబు నమ్రత ఇద్దరూ కూడా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రేమ పెళ్లి తర్వాత విడిపోతున్న జంటలు ఎందరో.. కానీ వీరిద్దరు మాత్రం ఇప్పటికి గొడవలు లేకుండా కలిసే ఉంటున్నారు. అంతే కాదు ఆదర్శ దంపతులుగా పేరు సంపాదించింది ఈ జంట.