PM Modi Drives Car In Sweden: మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సాంకేతికతను బాగా ఉపయోగించుకుంటారు. టెక్నాలజీని వాడుతూ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన 5జీ టెక్నాలజీని ఉపయోగించుకుని స్వీడన్ లోని కారును నడిపి అందరిలో ఆశ్చర్యం నింపారు. 5జీ టెక్నాలజీతో మోడీ ఎరిక్సన్ స్టాల్ లో ఇలా చేశారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో అందరు చూస్తున్నారు. స్పందిస్తున్నారు. ప్రధాని మోడీ సాంకేతికతకు దన్నుగా నిలుస్తున్నారని కొనియాడుతున్నారు.

దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో ప్రధాని చేస్తున్న కృషి అమోఘమని క్యాప్షన్ పెట్టి మరీ పోస్టు చేశారు. దీంతో ఢిల్లీ నుంచి స్వీడన్ లో కారు నడిపిన ఘనత సాధించిన ప్రధానిగా మోడీ మరో రికార్డు సొంతం చేసుకోవడం విశేషం. 5జీ టెక్నాలజీతో యూరప్ లోని కారును ట్రస్ట్ డ్రైవ్ చేయడంతో అందరు ఫిదా అవుతున్నారు. స్వీడన్ లోని ఒక ఇండోర్ కోర్సులో ఈ వాహనాన్ని ఉంచారు. దీన్ని నావిగేట్ చేయడం, కంట్రోల్ సెటప్ న్యూ ఢిల్లీలోని ఎరిక్స్ స్టాల్ లో ఏర్పాటు చేశారు.
Also Read: AP Minister Ambati Rambabu: సినిమాల్లో నటించిన వైసీపీ మంత్రి అంబటి రాంబాబు
ప్రధాని మోడీ సీటుపై కూర్చుని ఎదురుగా ఉన్న హ్యాండిల్, ఎక్సలేటర్, బ్రేకులను ఉపయోగించి కారు నడపడం బాగుందని పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఇలాంటి వీడియోలే వైరల్ గా మారుతున్నాయి. దేశం పని చేసే ప్రధానిగా నరేంద్ర మోడీకి ఎంతో మంచి పేరుంది. ఈ నేపథ్యంలో మోడీ కారు డ్రైవ్ చేయడం సంచలనం కలిగించింది. ఇక్కడి నుంచే అక్కడి కారును కంట్రోల్ చేయడం మనకు దొరికిన కొత్త టెక్నాలజీ. దీంతో సాంకేతిక సాయంతో ప్రధాని మునుముందు మరిన్ని విజయాలు సొంతం చేసుకుంటారనే అభిప్రాయం అందరిలో వస్తోంది.

5జీ సేవలు అందుబాటులోకి వచ్చాక ప్రధాని దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. దేశాన్ని ప్రగతి పథంలో నడపడంలో 5జీ సేవలు ప్రధానమైనవి. అందుకే 5జీ సేవలు దేశవ్యాప్తంగా వినియోగంలోకి తీసుకొచ్చారు. దీంతో అద్భుతాలు చేయవచ్చని భావిస్తున్నారు. దీనికి అనుగుణంగానే మన దేశ ప్రగతి ఎంతో పెరుగుతుందని ఆశిస్తున్నారు. దీని కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. 5జీ నెట్ వర్క్ తో మన గణాంకాలు మొత్తం మారి దేశం పురోగమనంలోకి మారుతోందని పలువురు చెబుతున్నారు.
Also Read:Munugode By Election 2022: మునుగోడులో మూడు పార్టీలకు ముగ్గురు మొనగాళ్లు వీరే