Pawan Kalyan In Godfather: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు , హిందీ మరియు మలయాళం బాషలలో ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచినా లూసిఫెర్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ మరియు రిలీజ్ ట్రైలర్స్ అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొల్పాయి..ఆచార్య సినిమా తో డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి కి గాడ్ ఫాదర్ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది..ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ప్రతి సన్నివేశం మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు కనులపండుగ లాగానే ఉంటుందట..ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము లేపేస్తున్నాయి..కచ్చితంగా రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో అభిమానులకు మైండ్ బ్లాస్ట్ అయ్యే రేంజ్ లో మూడు సర్ప్రైజ్ ఎలెమెంట్స్ ఉంటాయట.

ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో డైరెక్టర్ మోహన్ రాజా మాట్లాడిన ఆ మాటలు అభిమానులకు పూనకాలు రప్పించే విధంగా చేస్తుంది..ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏమిటి అని అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు..ఒరిజినల్ వర్షన్ లూసిఫెర్ లో మోహన్ లాల్ తమ్ముడి పాత్రలో ప్రముఖ హీరో టోవినో థామస్ ఒక గెస్ట్ రోల్ చేస్తాడు..ఆ రోల్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించాడా?,ఇదేనా డైరెక్టర్ మోహన్ రాజా చెప్పిన సర్ప్రైజ్ అంటూ అభిమానులు అంచనా వేస్తున్నారు.
Also Read: Priyamani: పాపం ప్రియమణికి ఏమైంది.. మరీ సగమై పోయిందేంటి!

పవన్ కళ్యాణ్ ఒక రోజు తెల్ల చొక్కా మరియు తెల్ల పంచె వేసుకొని గాడ్ ఫాదర్ సెట్స్ కి వెళ్ళాడు..ఈ పాత్ర చిత్రీకరణ కోసమే ఆ గెటప్ లో వెళ్లాడా?,ఒరిజినల్ వెర్షన్ లూసిఫెర్ లో కూడా టోవినో థామస్ పాత్ర గెటప్ అదే విధంగా ఉంటుంది..ఒకవేళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ గెస్ట్ రోల్ చేసి ఉంటె థియేటర్స్ బ్లాస్ట్ అయిపోవడం పక్కా అని చెప్పొచ్చు..ఓపెనింగ్స్ కూడా తారాస్థాయికి చేరుకుంటాయి..మరి డైరెక్టర్ చెప్పిన ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ రోలా కాదా అనేది మరి కొద్దీ గంటల్లో తెలియనుంది.
Also Read: Pooja Hegde: ఆ పార్ట్స్ కి సర్జరీ.. బాగానే ఉన్నాయిగా పూజా నీకు అవసరమా?
[…] Also Read: Pawan Kalyan In Godfather: ‘గాడ్ ఫాథర్’ లో అతిధి పాత్ర… […]
[…] […]