Priyamani: హీరోయిన్ ప్రియమణి లేటెస్ట్ లుక్ షాక్ ఇచ్చింది. ఆమె చాలా సన్నగా అయ్యారు. నాలుగు పదుల వయసుకు దగ్గరపడుతున్న ప్రియమణి బరువు తగ్గడంతో అందరూ ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. కెరీర్ బిగినింగ్ నుండి ప్రియమణి సన్నగానే ఉన్నారు. అందంలో కొంచెం అటూ ఇటూ ఉన్నా టాలెంట్ తో స్టార్ లేడీ అయ్యారు. జాతీయ అవార్డు అందుకున్న ప్రియమణి లాంగ్ కెరీర్ లీడ్ చేస్తున్నారు. ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ మరింత జోరుగా ఉంది. కొన్ని రకాల పాత్రలకు ఆమె బెస్ట్ ఛాయిస్ గా మారారు.

అలాగే వెంకటేష్, అజయ్ దేవ్ గణ్ వంటి సీనియర్ స్టార్స్ పక్కన హౌస్ వైఫ్ పాత్రలకు బాగా సెట్ అవుతున్నారు. ప్రస్తుతం ప్రియమణి చేతిలో అరడజను చిత్రాలు ఉన్నాయి. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్ ఇలా అన్ని పరిశ్రమలను కవర్ చేస్తున్నారు. ప్రియమణితో పాటు పరిశ్రమలో అడుగుపెట్టిన అనేకమంది స్టార్ హీరోయిన్స్ ఎప్పుడో చాప చుట్టేశారు. ప్రియమణి మాత్రం బిజీ యాక్ట్రెస్ గా సత్తా చాటుతున్నారు.
Also Read: Pooja Hegde: ఆ పార్ట్స్ కి సర్జరీ.. బాగానే ఉన్నాయిగా పూజా నీకు అవసరమా?

మరోవైపు బుల్లితెరపై సత్తా చాటుతున్నారు. పాపులర్ డాన్స్ రియాలిటీ షో ఢీ యాంకర్ గా ప్రియమణి చాలా కాలంగా వ్యవహరిస్తున్నారు. రష్మీ, సుధీర్ వంటి స్టార్స్ ని షో నుండి తీసేసిన యాజమాన్యం ప్రియమణిని మాత్రం కొనసాగిస్తోంది. ఆ విధంగా బుల్లితెర ప్రేక్షకులకు ఆమె దగ్గరయ్యారు. ఇక సోషల్ మీడియాలో అమ్మడు సంచలనాలు మాములుగా ఉండవు. తరచుగా ఫోటో షూట్స్ చేస్తూ ఉంటారు.

తాజా ఫోటో షూట్ లో ప్రియమణి లుక్ షాక్ ఇచ్చింది. ఆమె మరింత సన్నగా కనిపించారు. ప్రియమణి బరువు తగ్గినట్లు స్పష్టంగా అర్థం అవుతుండగా, అంత అవసరం ఏమొచ్చిందని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ప్రియమణి కావాలని బరువు తగ్గారా? లేక అనారోగ్య కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా 2017లో ప్రియమణి ఈవెంట్ ఆర్గనైజర్ ముస్తఫా రాజ్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన అమెరికాలో ఉంటారు. చాలా అరుదుగా వీరిద్దరు కలుస్తారు. ఆ మధ్య విడిపోతున్నారంటూ రూమర్స్ వచ్చాయి.
Also Read:Bigg Boss 6- Sudigali Sudheer: వైల్డ్ కార్డ్ తో ఎంట్రీ..బిగ్ బాస్ హౌస్ లోకి సుడిగాలి సుధీర్?
[…] […]
[…] […]