Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: యువతను ఆయుధంగా వాడుతున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan: యువతను ఆయుధంగా వాడుతున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ఇప్పటివరకూ యువతను ఓటు బ్యాంక్ గా మలుచుకున్న రాజకీయ పార్టీలను చూశాం. మీ భవిష్యత్ కి మాది భరోసా అంటూ హామీ ఇచ్చిన పార్టీలను చూశాం. అంతెందుకు యువతకు లక్ష ఉద్యోగాలు కల్పిస్తాం.. ఏపీకి ప్రత్యేక హోదా తెస్తే ఆటోమేటిక్ గా ఉద్యోగాలు వచ్చేస్తాయి. యువతను తిరుగులేని శక్తి చేస్తామంటూ గత ఎన్నికల ముందు జగన్ భ్రమ కల్పించారు. ఊరూవాడ ప్రచారం చేశారు. యువతతో సదస్సులు నిర్వహించారు. ఎన్నికల్లో మద్దతు కూటగట్టారు. యువత కూడా జగన్ వైపు టర్న్ అయ్యారు. తీరా అధికారంలోకి వచ్చాక బొమ్మ చూపించారు. ఆదిలోనే ప్రత్యేక హోదాకు పాడె కట్టారు. కొత్త పరిశ్రమల రావడం లేదు. ఉన్న పరిశ్రమలు మూతపడ్డాయి. వాటిని తెరిపించే ప్రయత్నం చేయలేదు. విభజన హామీల్లో భాగంగా ఏర్పాటుచేయాల్సిన విద్యాసంస్థల జాడలేదు.విజయసాయిరెడ్డి వంటి వారు చిన్నచిన్న బోగస్ సంస్థలతో ఉద్యోగాల కల్పన పేరిట నిరుద్యోగ యువతను దారుణంగా వంచించారు. ఇటువంటి తరుణంలో అసలు యువత ఉద్దేశ్యం ఏమిటి? ఉద్యోగ, ఉపాధి కల్పనలో ప్రభుత్వ పాత్ర ఏమిటి? ప్రభుత్వాల నుంచి ఎటువంటి సాయం కోరుకుంటున్నారు? అని తెలుసుకునేందుకు జనసేనాని పవన్ నడుంబిగించారు. యువశక్తి పేరిట యువతను సంఘటితం చేసి భారీ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు.

Pawan Kalyan
Pawan Kalyan

ఈ నెల 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి పార్టీ తరుపున చకచకా ఏర్పాట్లు అవుతున్నాయి. కార్యక్రమ నిర్వహణకు సంబంధించి పోస్టర్లను ఇప్పటికే పవన్ ఆవిష్కరించారు. పార్టీ కీలక నేత నాదేండ్ల మనోహర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి లక్షలాది మంది యువత తరలివచ్చే అవకాశం ఉంది. ‘స్వామి వివేకానంద జయంతి నాడు జనసేన యువశక్తి కార్యక్రమం ఉంటుంది. స్వామి వివేకానంద స్ఫూర్తితో రణస్థలంలో యువశక్తి తడాఖా చూపించబోతోంది. యువతీయువకులు అందరూ ఆహ్వానితులే. యువత తమ ఆలోచనల గురించి, వారి కష్టాల గురించి, వారి భవిష్యత్ గురించి గళం వినిపించేలా యువశక్తి కార్యక్రమం ఉంటుంది. మన యువత మన భవిత అని భావించి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి’ అంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన వీడియో సందేశం వైరల్ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా యువతను ఆకర్షిస్తోంది.

యువశక్తి కార్యక్రమంపై పవన్ తాజాగా మరో ట్విట్ చేశారు. ఆ రోజున యువత చెప్పే మాటలు వినాలని ఆతృతగా ఉందని చెప్పారు. తమ సమస్యలు తీర్చాలని విద్యార్థులు, ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగులు చేసిన ఆందోళనలు, వారి పై పోలీసులు చేసిన దాడులతో కూడిన వీడియోలను జతచేసి పోస్టు చేశారు. పవన్ తాజాగా చేసిన ఈ ట్విట్ వైరల్ అవుతోంది. యువతను మేల్కొలుపుతోంది. సాధారణంగా మిగతా రాజకీయ పార్టీలు అధినేతల పర్యటనకు జనసమీకరణ చేస్తాయి. పవన్ మాత్రం అందుకు అతీతం. ఇప్పటివరకూ పవన్ పర్యటనలకు జనాలను సమీకరించే సంస్కృతి జనసేనలో లేదు. ప్రజలు పవన్ కోసం స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. అయితే లక్షలాది మందితో సత్తా చాటాలని జనసేన భావిస్తున్నారు. యువత ఆలోచనలను షేర్ చేసుకోవాలని భావిస్తున్నారు. జనసేనానితో పాటు దాదాపు 100 మంది యువ ప్రతినిధులు మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో యువత మాటలను వినాలని ఆతృతగా ఉందని పోస్టు చేయడం జనసైనికులను ఆకట్టుకుంటోంది.

Pawan Kalyan
Pawan Kalyan

ఉత్తరాంధ్ర నుంచి వలసలు అధికం. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అంతంతమాత్రం. పరిశ్రమలు లేవు. పేరు మోసిన విద్యాసంస్థలు లేవు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పరిశ్రమలు మచ్చుకైనా కానరావడం లేదు. అందుకే లక్షలాది మంది యువత వలసబాట పట్టారు. ఈ క్రమంలో వారి ఆకాంక్షలు, జనసేన ప్రభుత్వం ఏర్పాటుచేస్తే ఏం చేయాలి? యువత కోసం ఎటువంటి పథకాలు రూపొందించాలి? అని తెలుసుకునేందుకు పవన్ యువశక్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

 

నీ నోరు చెత్త కుప్ప.. రోజాకు జబర్దస్త్ ఆర్టిస్టుల సెటైర్లు || Ek Number News || Ok Telugu

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version