Minister Roja- Getup Srinu: చిరంజీవి అభిమానిగా గెటప్ శ్రీను మంత్రి రోజాకు ఘాటైన సమాధానం చెప్పారు. ఆమె ఉనికి కోసం పచ్చి అబద్దాలు చెబుతున్నారంటూ విమర్శించాడు. చిరంజీవిపై ఆమె చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కోరారు. విషయంలోకి వెళితే… మెగా బ్రదర్స్ ని ఉద్దేశిస్తూ రోజా దారుణ కామెంట్స్ చేశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ప్రజలకు చేసిందేమీ లేదు. కనీసం సొంత జిల్లా ప్రజలకు కూడా వారు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు. అందుకే అక్కడి ప్రజలు ముగ్గురు అన్నదమ్ములను ఓడించారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత తమకు జీవితం ఇచ్చిన ప్రజలకు మేలు చేశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ మాత్రం జనాలకు కృతజ్ఞతగా ఏమీ చేయలేదంటూ… వారి దాన గుణాన్ని రోజా ప్రశ్నించారు.

రోజా ఆరోపణలు నటుడు నాగబాబు ఖండించారు. రోజా నోరు మున్సిపాలిటీ చెత్త కుప్పతో సమానం. అందుకే ఎన్ని సార్లు మెగా బ్రదర్స్ పై విమర్శలు చేసినా నేను స్పందించలేదు. ఆమె మంత్రిగా ఉన్న పర్యాటక శాఖ అట్టడుకు వెళ్ళిపోయింది. పర్యాటక రంగంపై ఆధారపడిన లక్షల మంది ఇబ్బందులు పాలవుతున్నారు. ఏపీలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ఆమె బాధ్యత. అది వదిలేసి అనవసర విషయాలు మాట్లాడుతుంది.. అంటూ ఆయన మండిపడ్డారు.
కాగా రోజా చిరంజీవి మీద చేసిన ఆరోపణలను జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను సైతం ఖండించారు. ఆయన కొంచెం ఘాటుగానే రోజాకు సమాధానం చెప్పాడు. గెటప్ శ్రీను రోజా ఆరోపణలకు కౌంటర్ గా ఒక సోషల్ మీడియా సందేశం పంచుకున్నారు. అందులో… చిరంజీవిగారి దాన గుణం, సేవా గుణం తెరిచిన పుస్తకం. ఆ విషయంలో ఆయన ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. మీ ఉనికి కోసం ఇలాంటి నిరాదరణ ఆరోపణలు చేయడం సరికాదు. మీ నోటి నుండి ఇంత పచ్చి అబద్దాలు వస్తాయని ఊహించలేదు. మీరు మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి… అంటూ గెటప్ శ్రీను రాసుకొచ్చాడు.

గెటప్ శ్రీను సందేశం క్షణాల్లో వైరల్ గా మారింది. ఇక జబర్దస్త్ జడ్జెస్ గా రోజా, నాగబాబు ఏళ్ల తరబడి కలిసి పని చేశారు. అలాగే స్టార్ కమెడియన్ అయిన గెటప్ శ్రీనుతో ఆమెకు మంచి అనుబంధం ఉంది. గెటప్ శ్రీను రోజాను బాగా గౌరవిస్తారు. అయితే అభిమాన నటుడి విషయంలో ఆమె నిరాధార ఆరోపణలు చేయడం… ఆయన్ని హర్ట్ చేసినట్లుంది. అందుకే ఆయన ఫైర్ అయ్యాడు. తెగించి రోజాను ప్రశ్నించాడు.
