Homeఆంధ్రప్రదేశ్‌AP MLC Election Results: వైసీపీ ఘోర ఓటమికి పవన్ ఆ ఒక్క పిలుపే కారణం

AP MLC Election Results: వైసీపీ ఘోర ఓటమికి పవన్ ఆ ఒక్క పిలుపే కారణం

AP MLC Election Results
pawan kalyan- jagan

AP MLC Election Results: ఏదైనా చేయొచ్చు కానీ.. మాట తూలకూడదంటారు. ఒక్కసారి మాట్లాడితే వెనక్కి తీసుకోలేమంటారు. అందుకే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని పెద్దలు చెబుతుంటారు. ఒక్కొసారి మనం ఆడే మాటలే రిఫ్లక్షన్ ఇస్తుంటాయి. అంతులేని నష్టాలను మిగుల్చుతాయి. సమాజంలో దోషిగా నిలబడతాయి. నలుగురిలో నవ్వులపాలు చేస్తాయి. ఇప్పుడు ఏపీలో అధికార వైసీపీ కూడా ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ ను చులకన చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రతిబంధకంగా మారుతున్నాయి. గట్టి రిప్లయ్ ఇస్తున్నాయి. వైసీపీకి సౌండ్ లేకుండా చేస్తున్నాయి.

వైసీపీ శ్రేణులు నిత్యం ఒక పవర్ ఫుల్ డైలాగు చెబుతుంటారు. దానినే అన్నివేళలా వినియోగిస్తుంటారు. అదే ‘సింహం సింగిల్ గా వస్తుంది’ రజనీకాంత్ పలికే ‘నాన్న పందులే గుంపుగా వస్తాయి.. సింహం సింగిల్ గా వస్తుంది’ అన్న డైలాగులో సెకెండ్ లైన్ ను తీసుకొని వైసీపీ శ్రేణులు తెగ వైరల్ చేస్తుంటారు. గత ఎన్నికల్లో 151 సీట్లను జగన్ ఏకపక్షంగా గెలుచుకోవడాన్ని బలంగా చెప్పుకోవడం, చంద్రబాబు, పవన్ ల మధ్య పొత్తును హేళన చేస్తూ తరచూ ఈ వ్యాఖ్య చేస్తుండడం రివాజుగా మారింది. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తరువాత అదే డైలాగును తిప్పికొడుతూ జనసేన శ్రేణులు తిరిగి కౌంటర్ ఇస్తున్నాయి. ‘నాన్న సింహం ఒక్క పిలుపుతో’ మీ పరిస్థితి చూడండి అంటూ కౌంటర్ అటాక్ చేస్తున్నాయి. వైసీపీకి తప్ప ఎవరికైనా ఓటు వేయండన్న పవన్ పిలుపును ట్యాగ్ చేసి మరీ ప్రచారం చేస్తున్నాయి.

రానున్న ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో పోటీచేయగల సత్తా పవన్ కు ఉందా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తమ నాయకుడు జగన్ సింహం లాంటోడని.. పందులే గుంపుగా వస్తాయంటూ పవన్, చంద్రబాబులను ఉద్దేశిస్తూ మంత్రుల నుంచి దిగువస్థాయి నేతల వరకూ వ్యంగ్య ప్రకటనలు ఇస్తున్న సంగతి తెలిసిందే. కాలం ఎప్పుడూ ఒకేలా వుండ‌దు. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌తి ఒక్క‌డి స‌ర‌దా తీరుస్తుంది. నేను సింహం, సింగల్‌గా వ‌స్తాన‌నంటూ ప్ర‌తోడి మీద‌కి వెళ్తూ వుంటే ఇలాగే వుంటుంది” అని వైసీపీని విమ‌ర్శిస్తూ సోష‌ల్ మీడియాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫ‌లితాల‌ను ప్ర‌స్తావిస్తూ జనసేన వర్గాలు తెగ విరుచుకుపడుతున్నాయి. సింహాన్ని అడ‌వి దున్న కొమ్ముల‌తో కుమ్మే ఫొటో, దాని ప‌క్క‌న వైసీపీ నేత‌ల చిత్రాల‌ను పెట్ట‌డం ఆక‌ట్టుకుంటోంది. అయితే గతంలో ఏ చిత్రవిచిత్రాలతో వైసీపీ సోషల్ మీడియా పవన్ ను చిన్నతనం చేసిందో.. ఇప్పుడు అదే ఫార్ములాతో జన సైనికులు ఆడుకుంటున్నారు. వైసీపీకి చుక్కలు చూపిస్తున్నారు.

AP MLC Election Results
jagan

ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత అందరి చూపు పవన్ కళ్యాణ్ పై పడింది. జనసేన మద్దతు ఏ పార్టీకి ఉంటుందా? అన్న సందేహం నెలకొంది. ఇంతవరకూ మిత్రపక్షంగా చెప్పుకుంటున్న బీజేపీయా? వచ్చే ఎన్నికల్లో కలిసి నడవాలంటున్న టీడీపీకా? అన్న ప్రశ్న అయితే తలెత్తింది. కానీ పవన్ అనూహ్యంగా వైసీపీకి తప్ప ఎవరికైనా ఓటు వేయండని పిలుపునివ్వడం గమనార్హం. విద్యార్థులు, యువతలోపవన్ ఫాలోయింగ్ అధికం. దీంతో ఎక్కువ మంది టీడీపీ వైపు మొగ్గుచూపారు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ ప్రకటన టీడీపీకి లాభించింది. వైసీపీకి ఘోర ఓటమిని కట్టబెట్టింది. అందుకే ఇప్పుడు సింహం అటు ఇటు అయ్యింది అంటూ జన సైనికులు ఖుషీ అవుతున్నారు. వైసీపీకి గట్టిగానే బదులిస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular