Homeక్రీడలుBabar Azam- Harbhajan Singh: ఐపీఎల్‌పై బాబర్‌ అక్కసు.. చాన్స్‌ రాలేదనే ఏడుపు అన్న భజ్జీ!

Babar Azam- Harbhajan Singh: ఐపీఎల్‌పై బాబర్‌ అక్కసు.. చాన్స్‌ రాలేదనే ఏడుపు అన్న భజ్జీ!

Babar Azam- Harbhajan Singh
Babar Azam- Harbhajan Singh

Babar Azam- Harbhajan Singh: ఇండియాపై, ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌పై ఎప్పుడూ పడి ఏడుస్తుంటారు పాకిస్థాన్‌ క్రికెటర్లు. కొన్ని తరాలుగా వారిది ఇదే బుద్ధి. ఇప్పుడు వారి వారసుడు బాబర్‌ అజమ్‌ సైతం అలాగే తయారయ్యాడు. ఆటతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ కుర్రాడు.. విరాట్‌ కోహ్లీని గొప్ప క్రికెటర్‌గా పేర్కొంటూ.. కాస్త పర్వాలేదనే విధంగా ఇన్ని రోజులు నడుచుకున్నాడు. కానీ.. రోజులు గడుస్తున్న కొద్ది అసలు మనిషి బయటికి వస్తున్నాడు. తాజాగా ఐపీఎల్‌ను తక్కువ చేస్తూ.. బాబర్‌ అజమ్‌ కామెంట్‌ చేశాడు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబర్‌ అజమ్‌.. ఐపీఎల్, బిగ్‌ బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లో దేన్ని ఎన్నుకుంటారని ప్రశ్నించగా.. బిగ్‌బాష్‌ లీగ్‌ అన్నాడు. సరే అది అతని ఇష్టం.. రెండు ఆప్షన్స్‌లో ఒక దాన్ని ఇష్టమని చెప్పాడు. అక్కడితో ఆగితే తప్పులేదు. కానీ.. ఐపీఎల్‌ను ఎందుకు తక్కువ, బీబీఎల్‌ ఎందుకు ఎక్కువా అంటూ విశ్లేషణ కూడా చేశాడు.

ఆస్ట్రేలియాలో బీబీఎల్‌..
‘బిగ్‌బాష్‌ లీగ్‌ ఆస్ట్రేలియాలో జరుగుతుంది. అక్కడి పిచ్‌లు బౌన్సీగా, ఫాస్ట్‌ట్రాక్‌లుగా ఉంటాయి. అక్కడ ఆడితే మనల్ని మనం మరింత మెరుగు పర్చుకోవచ్చు. అదే ఇండియాలో జరిగే ఐపీఎల్‌లో ఆడిన ఏం ఉంటుంది, అవే ఆసియా కండీషన్‌ పిచ్‌లు’ అంటూ మాట్లాడాడు. ఈ వ్యాఖ్యలపై భారత క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. అసలు బిగ్‌బాష్‌కు ఐపీఎల్‌కు పోలికేంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్‌ ఉన్న, డిమాండ్‌ ఉన్న, రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌ అని, ఏ విషయంలో కూడా బిగ్‌బాష్‌.. ఐపీఎల్‌తో పోటీ పడలేదని అంటున్నారు. అసలు బాజర్‌ అజమ్‌ను ఐపీఎల్‌లో ఆడమని ఎవరైనా ఆడిగారా? అంటూ సెటైర్లు వేస్తున్నారు.

Babar Azam- Harbhajan Singh
Babar Azam- Harbhajan Singh

కౌంటర్‌ ఇచ్చిన భజ్జీ..
బాబార్‌ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ స్టార్‌ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. మనకు ఆడే అవకాశం రానప్పుడు ఎవరైనా ఇంతకంటే మిన్నగా ఎలా మాట్లాడుతారు అని ఎద్దేవా చేశారు. ‘మామిడి పండు తిన్న తర్వాతనే దాని రుచి తెలుస్తుంది.. తినకుండానే అది ఎలా ఉందో ఎలా చెప్పగలం’ బాబర్‌ కూడా తనకు చాన్స్‌ లేదని.. ఐపీఎల్‌ను తక్కువ చేసి మాట్లాడుతున్నాడని కౌంటర్‌ ఇచ్చాడు.

అభిమానుల ఆగ్రహం..
ఐపీఎల్‌లో ఆడే అవకాశం లేకనే బాబర్‌ అజమ్‌ ఈ విధంగా తన అక్కసును వెల్లగక్కుతున్నాడని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. ఆసియా కండీషన్‌ పిచ్‌లపై ఆడితే ఏంటి ఉపయోగం అని.. తొలి ఐపీఎల్‌లో ఆడిన మీ సీనియర్‌ క్రికెటర్లకు తెలియదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. తనని తాను మెరుగుపర్చుకోవడం కోసమే బాబర్‌ అజమ్‌ విదేశీ లీగులు ఆడుతుంటే.. బిగ్‌బాష లీగ్, సౌతాఫ్రికా లీగ్‌లలో డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ఆడి, అక్కడి పిచ్‌లపై కావాల్సినంత ప్రాక్టీస్‌ పొందొచ్చు అని అంటున్నారు. ఆసియా కండీషన్‌ పిచ్‌లపై అంత అనాసక్తి చూపిస్తున్న బాబర్‌ అజమ్‌ పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో కూడా ఎందుకు ఆడుతున్నాడు? వెళ్లి ఇంగ్లండ్‌లో కౌంటీల్లో ఆడుకోవచ్చు కదా? అని మండిపడుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular