Ustad Bhagat Singh Shooting: అప్పుడే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ ని పూర్తి చేసిన పవన్ కళ్యాణ్..ఇంత స్పీడ్ గా ఉన్నదేంటి!

Ustad Bhagat Singh Shooting: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కలిసి ఈ సినిమా చేస్తుండడం తో ఈ చిత్రం పై ప్రారంభానికి ముందు నుండే అంచనాలు భారీ స్థాయిలో ఉండేవి. రీసెంట్ గానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో వేసిన ఒక సెట్ లో […]

Written By: Suresh, Updated On : April 13, 2023 4:29 pm
Follow us on

Ustad Bhagat Singh Shooting

Ustad Bhagat Singh Shooting: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కలిసి ఈ సినిమా చేస్తుండడం తో ఈ చిత్రం పై ప్రారంభానికి ముందు నుండే అంచనాలు భారీ స్థాయిలో ఉండేవి. రీసెంట్ గానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో వేసిన ఒక సెట్ లో ప్రారంభం అయ్యింది.

సుమారుగా పది రోజుల నుండి సాగుతున్న ఈ మొదటి షెడ్యూల్ లో మొన్ననే హీరోయిన్ శ్రీలీల కూడా పాల్గొన్నది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో తెరకెక్కించారు. అయితే ఈ షెడ్యూల్ రేపటితో ముగియనుంది అట.నిన్న గాక మొన్న ప్రారంభం అయ్యినట్టు అనిపిస్తున్న మొదటి షెడ్యూల్ అప్పుడే పూర్తి అయిపోయిందా అని అభిమానులు షాక్ కి గురయ్యారు.

ఇంత ఫాస్ట్ గా షూటింగ్ చేసేస్తున్నారు ఔట్పుట్ సరిగా వస్తుందా అనే టెన్షన్ అభిమానుల్లో నెలకొంది. కానీ పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం 90 రోజులకు పైగానే కాల్ షీట్స్ ఇచ్చాడని, అభిమానులు ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదని, ఈ చిత్రం గబ్బర్ సింగ్ కి మించి ఉండబోతుందని మూవీ యూనిట్ కి బాగా దగ్గరగా ఉన్నోళ్లు చెప్తున్నారు.ముఖ్యంగా సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చిందట, పవన్ కళ్యాణ్ నుండి ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ వచ్చి చాలా కాలమే అయ్యింది.

Ustad Bhagat Singh Shooting

రీ ఎంట్రీ తర్వాత కూడా ఆయన వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ లాంటి సీరియస్ రోల్స్ చేస్తున్నాడు. అభిమానులు ఆయన నుండి కమర్షియల్ ఎంటర్టైనర్ కోసం ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉన్నారు, అలాంటి సమయం లో వాళ్లకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒక విందు భోజనం లాగ ఉండబోతుందని చెపున్నారు. చూడాలి మరి ఫిలిం నగర్ లో ప్రచారం అవుతున్న ఈ వార్త ఎంతవరకు నిజం అవుతుందో అనేది.