India vs England, Lord’s ODI : చెత్త బౌలింగ్.. దరిద్రపు బౌలింగ్.. పస లేని బౌలింగ్.. పనికిమాలిన బౌలింగ్..ఇంతకంటే ఎక్కువనే తిట్టాలి. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాలి. గల్లీలో వేసినట్టు.. టెన్నిస్ బాల్ తో ఆడినట్టు..కొట్టుకో అంటూ బ్యాట్ మీదకు వేస్తే కొట్టకుండా ఎలా ఉంటారు. బ్యాట్ మీదకు బంతులు వస్తుంటూ పండగ చేసుకున్నారు ఇంగ్లాండ్ బ్యాటర్లు.. ఏ బౌలర్ ను చూడలేదు. ఎవరినీ వదిలపెట్టలేదు. విరవిహారం చేశారు. సింహతాండవం చేశారు. పరుగుల విధ్వంసం కాదు..లార్డ్స్ లో పరుగుల సునామీ నెలకొల్పారు.
సిరీస్ డిసైడర్ మ్యాచ్.. పైగా ప్రఖ్యాత లార్డ్స్.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ లో చివరి మ్యాచ్ ఆడుతున్నారు. అలాంటి ఈ మ్యాచ్ లో ఇండియా బౌలర్లు పూర్తిగా చేతులేత్తెశారు. లార్డ్స్ మైదానంలో బంతిమీద పట్టు సాధించలేక.. బంతిని సరైన దిశలో వేయలేక.. పరుగులు దారుణంగా సమర్పించుకున్నారు. వికెట్లు తీయలేక ఆపసోపాలు పడ్డారు.
అర్ష్ దీప్ సింగ్ 10 ఓవర్లలో 72, ప్రసిద్ధ్ క్రిష్ణ 10 ఓవర్లలో 69 పరుగులు రెండు వికెట్లు, ప్రిన్స్ యాదవ్ పది ఓవర్లలో 79 పరుగులు, గుర్నూర్ బ్రార్ 10 ఓవర్లలో 97 పరుగులు, అక్షర్ పటేల్ 10 ఓవర్లలో 61 పరుగులు సమర్పించుకున్నారు. ఇవేకాదు, ఎక్స్ ట్రా లరూపంలో 26 పరుగులు ఇచ్చారు. ఇందులో వైడ్ లు 16, నోబాల్ ఒకటి, లెగ్ బైస్ 9..
లార్డ్స్ మైదానంలో పరిస్థితులకు తగ్గట్టుగా బౌలింగ్ దళాన్నిరూపొందించడంలో గౌతమ్ గంభీర్ పూర్తిగా విఫలమయ్యాడు. అనామక జట్టు మాదిరిగా, అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడని బౌలర్ల మాదిరిగా మన బౌలర్లు బౌలింగ్ వేస్తుంటూ మ్యాచ్ చూస్తున్న ఇండియన్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క అభిమాని ముఖంలో నెత్తురు చుక్క లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మరికొద్ది రోజుల్లోదక్షిణఫ్రికా వేదికగా వన్డే వరల్డ్ కప్ మొదలవుతుంది. గత ట్రోఫీలో టీమిండియా ఫైనల్ లో ఓడిపోయింది. ఇలాంటి సమయంలో మన బౌలర్లు ఇలాంటి బౌలింగ్ వేస్తే వన్డే వరల్డ్ కప్ కాదు కదా, కనీసం క్వార్టర్ ఫైనల్ వెళ్లడం కూడా కష్టమే. ఇలాంటి బౌలింగ్ దళాన్ని గొప్పగా గౌతమ్ గంభీర్ ఎలా చెప్పుకుంటాడని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దయచేసి జట్టును వదిలిపెట్టు వెళ్లు.. ఇప్పటికైనా టీమిండియాను బతకనివ్వు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
