Jasprit Bumrah : ‘ఇలాంటి పరిస్థితుల్లో యార్కర్లు వేయాలి. కానీ ఒక్క బౌలర్ కు అనుభవం లేదు. యార్కర్లు వేయలేకపోతున్నారు. షార్ట్ పిచ్ బంతులు వేయడంలో కూడా నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నారు. బంతి బ్యాట్ మీదకు వస్తున్నప్పుడు ఇలా వేయడం ఏంటి.. నకుల్ బాల్స్ వేసుకుంటూ పోతే బ్యాటింగ్ ఇలా కాకుంటే ఎలా వేస్తారు.. చివరి మూడు ఓవర్లలో 62 పరుగులు ఇవ్వడం ఏంటి’.. ఇదీ మేము చేస్తున్న విమర్శలు కావు. ఆరోపణలు అంతకన్నా కావు. టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్ వేదికగా జరగుతున్న చివరిదైన మూడో వన్డేలో టీమిండియా బౌలర్ల బౌలింగ్ ను ఉద్దేశించి కామెంటేటర్లు చేసిన కామెంట్లు. కామెంటేటర్ల పరిస్థితి ఇలా ఉంటే.. మైదానంలో మ్యాచ్ లైవ్ చూస్తున్న అభిమానుల పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
సిరీస్ డిసైడర్ మ్యాచ్ లో బుమ్రా ఆడలేదు. గాయం వల్ల అతడు ఆడలేదా, కావాలని తప్పించారా.. ఈ ప్రశ్నలకు సమాధానం తెలియదు. కాకపోతే అతడికి గాయం అయిందని, అందువల్లే ప్రిన్స్ యాదవ్, గూర్నూర్ బ్రార్ ను జట్టులోకి తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. కానీ, వారిద్దరు అత్యంత చెత్త బౌలింగ్ వేశారు. ప్రిన్స్ యాదవ్ పది ఓవర్లపాటు బౌలింగ్ వేసి 79 పరుగులు ఇచ్చాడు. ఇతడు ఏకంగా 11 వైడ్లు వేయడం విశేషం. బ్రార్ అయితే 10 ఓవర్ల పాటు బౌలింగ్ వేసి 97 పరుగులు ఇచ్చాడు. అర్ష్ దీప్ సింగ్ 72, ప్రసిద్ద్ క్రిష్ణ 69, అక్షర్ పటేల్ 61 పరుగులు ఇచ్చారు.
ఇంగ్లాండ్ జట్టులో బెన్ డకెట్ 141, బెతెల్91, రూట్ 74, బట్లర్ 41* పరుగులు చేశారు. ఇంగ్లాండ్ జట్లు ఓపెనర్లు తొలి వికెట్ కు ఏకంగా 191 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రెండో వికెట్ కు 101, మూడో వికెట్ కు 31 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పారు. నాలుగో వికెట్ కు ఏకంగా 19 బంతుల్లోనే 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. వాస్తవానికి ఈ మ్యాచ్ లో బుమ్రా ఉండి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది.
యంగ్ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనే మంచిదే అయినప్పటికీ ఐపీఎల్ ను లెక్కలోకి తీసుకుని అవకాశాలు ఇస్తే ఫలితంగా ఇలాగే ఉంటుంది. షమీ, కులదీప్ యాదవ్ వంటి అనుభవం ఉన్న బౌలర్లు ఉన్నప్పటికీ అవకాశాలు ఇవ్వకుండా గౌతమ్ గంభీర్ చేస్తున్నప్రయోగాలు టీమిండియా కొంప ముంచాయి. వరల్డ్ కప్ సమీపిస్తున్న సమయంలో ఇలాంటి బౌలర్ల బౌలింగ్ విజేతగా ఎలా నిలుస్తుందో టీమిండియా మేనేజ్మెంట్ కే తెలియాలి.
ఒక్కబౌలర్ కూడా యార్కర్లు వేయలేకపోతున్నారంటే మనవాళ్ల సామర్థ్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నకుల్ బంతులు వేసి బ్యాటర్లకు బంగారం లాంటి అవకాశాలు ఇచ్చారు. కనీసం బంతి వేసే సమయంలో నైపుణ్యాన్ని ప్రదర్శించలేదు. లైన్ అండ్ లెంగ్త్ ను కొనసాగించలేదు. ఇంగ్లాండ్ బ్యాటర్లు పుల్లర్ లెంగ్త్ బంతులను ఆడటం లో ఇబ్బందిపడ్డారు. అలాంటి బంతులను పదేపదే వేయలేదు. ఒక బంతి అలా వేసిన తర్వాత మిగతా బంతులను నకుల్ బాల్స్ వేసి..బౌలర్లు తమ నిర్లక్ష్యాన్ని చాటుకున్నారు.
