
Janasena vs TDP : జనసేనాని సభకు జనహోరు కనిపిస్తుంది. ఇసుక వేస్తే రాలనంత మంది సభకు వస్తారు. పవన్ కోసం ప్రాణమిస్తారు. ఉత్తరాంధ్రలో ఏ మూలన పెట్టినా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కదిలివచ్చింది. యువత, ప్రజలు, మహిళలు, చంటిపిల్లలను వేసుకొని మరీ పవన్ కోసం గంటల తరబడి సభల్లో ఓపికగా ఉన్నారు.. విన్నారు.. కానీ చంద్రబాబు వస్తే మాత్రం పారిపోతున్నారు. ఆయన ఊకందపుడు ఉపన్యాసాలను ఎవరూ వినడం లేదు. బాబు ప్రసంగం మొదలుపెట్టగానే సభలోని 50శాతంమంది పారిపోతున్నారు. తాజాగా మచిలీపట్నంలో నిన్న జరిగిన చంద్రబాబు బహిరంగ సభలో జన ప్రవాహం ఏమీ లేక వెలవెలబోయిన వైనం కనిపించింది. దీన్ని బట్టి పవన్ సభలకు ఎంత బాగా జనం వస్తున్నారో… చంద్రబాబును ఎలా చీకొడుతున్నారో అర్థమవుతోందని నెటిజన్లు వీడియో ఫ్రూఫ్ లు చూపించి మరీ ఎండగడుతున్నారు.
గత నాలుగేళ్లుగా జనసేనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రైతుల నుంచి విద్యార్థుల వరకు వారి సమస్యలపై జనసేన పోరాడుతోంది. గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి పోరాడుతోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వేధింపులు ఎదుర్కొంంటోంది. ఈ క్రమంలో ప్రజలు జనసేన వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన ఎక్కడ సభ నిర్వహించినా ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇందులో భాగంగా మార్చి 14న జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా జనాన్ని చూసి దేశమే ఆశ్చర్యపోయింది. పవన్ కల్యాణ్ గన్నవరం నుంచిమచిలీ పట్నం రావడానికి 4 గంటల సమయం పట్టింది. దారంతా జనమే ఉండడం చూసి ఇతర పార్టీల నాయకుల షాక్ తింటున్నారు. ఇది కదా జనసేనపై అభిమానం అని ఇతర పార్టీల నాయకులు సైతం కామెంట్లు చేస్తున్నారు.
కొన్ని పత్రికలు సైతం జనసేన సభకు వచ్చిన జనాన్ని చూసి కాబోయే ముఖ్యమంత్రి పవనే అని పేర్కొంటున్నాయి. కానీ ఇటీవల టీడీపీ నేతలు కొందరు తమతో కలిసి వస్తేనేనే జనసేనకు మనుగడ ఉంటుందన్నట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ జనసేనతో పొత్తు ఉంటునే వారికి ఉపాధి దొరుకుతుందన్న విషయాన్ని గ్రహించడం లేదు. అందుకు చంద్రబాబు నిర్వహించిన మచిలీ పట్నం సభనే నిదర్శనం. మచిలీపట్నం వేదికగా ఆనాడు పవన్ సభ నిర్వహిస్తే ఇసకవేస్తే రాలనంత జనం. కానీ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన చంద్రబాబు మాట్లాడితే కనీసం కనిపించని కార్యకర్తలు.
కానీ కొందరు మాత్రం టీడీపీకి ప్రజలు తరలి వస్తున్నారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. టీడీపీతోనే భవిష్యత్ ఉంటుందంటూ జనసేన కార్యకర్తలకు లేనిపోనివి నూరిపోస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు తెలుసుకోవాలని జనసేన నాయకులు వాపోతున్నారు. ఏదీ నిజం? ఏదీ అబద్ధం? అనేది తెలుసుకోవాలని కోరుతున్నారు. అభిమానం ఉంటే ప్రజలు వద్దన్నా ఊరుకోరు. పవన్ సభకు దారిపోడవునా జనం. వీరందరిని రావాలని ఎవరైనా బలవంతం పెట్టారా? పవన్ పై ఉన్న అభిమానం తప్ప. దీనిని భట్టే కదా తెలుస్తుంది.. వచ్చేది జనసేన ప్రభుత్వమేనని..