
Papikondalu Trip: ఎండలు భగ్గుమంటున్నాయి.. వేసవి సెలవుల కారణంగా పిల్లలు ఇళ్లల్లోనే ఉండిపోతున్నారు. బయటకు వెళ్తామంటే ఉక్కపోతతో భరించలేని స్థితి. ఈ నేపథ్యంలో వారి మనసును ఉల్లాసపరిచేందుకు వీకెండ్ టూర్ ప్లాన్ వేసుకోవడానికి చాలా మంది ట్రై చేస్తుంటారు. అయితే సుదూర ప్రాంతాలకు వెళ్లే బదులు తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉండేవాటికే ఎక్కువ మంది ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం తెలుగు రాష్ట్రాల్లో మంచి టూరిస్టు స్పాట్లు ఉన్నాయి. ఇక వేసవిలో హాయిగా గడిపేందుకు ‘పాపికొండలు’ ఆకర్షిస్తోంది.
గతంలో కేవలం శీతాకాలంలో మాత్రమే పాపికొండల్లో విహరించడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం వేసవిలోనూ జర్నీ చేసేందుకు అవకాశం ఉండడంతో వీటిపై ఇంట్రెస్టు పెడుతున్నారు. వేసవిలో గోదావరి నీటిమట్టం తగ్గిపోయి లాంచి రన్ కావడానికి ఇబ్బందులు ఉండేవి. కానీ ఇప్పుడ ‘పోలవరం’ కాపర్ డ్యాం నిర్మించడం వల్ల నీటి మట్టం పెరిగింది. 27 మీటర్ల నీటి మట్టం ఉంటే బోటు షికారు చేయడానికి అవకాశం ఉంటుంది.
ఎలా వెళ్లాలి?
ఆంధ్రప్రదేశ్ లో ప్రవహించే గోదావరిని ఒడిసిపట్టి పాపికొండలు కనిపిస్తాయి. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. హైదరాబాద్ నుంచి సుమారు 410 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడికి ప్రత్యేక వాహనాల్లో లేదా రాజమండ్రి వరకు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లొచ్చు. అయితే ఖమ్మం నుంచి వెళ్లేవారు సైతం రాజమండ్రికి వెళ్లాలి. అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో టూరింగ్ స్పాట్ కు అనేక వాహనాలు అందుబాటులో ఉంటాయి.
ప్యాకేజీలు ఎలా ఉన్నాయి?
పాపికొండలు స్పాట్ రాజమహేంద్రవరం, పోచవరం, గండిపోచమ్మ వద్ద ఉన్నాయి. ఇక్కడి నుంచి ప్రత్యేక లాంచిలు ప్రారంభమై గోదావరి నదిపై విహరిస్తాయి. రాజమహేంద్ర వరం నుంచి వెళ్లాలనుకునేవారు ఒకరోజు పర్యటన(ఉదయం 7.30 నుంచి సాయంత్రం 7.30 వరకు) ఉంటుంది.పెద్దలకు రూ.1,250, చిన్నారులకు రూ.1,050 చార్జీలు వసూలు చేస్తారు. ప్యాకేజీలో భాగంగా టిఫిన్, భోజనం, స్నాక్స్ అందిస్తారు.
పోచవరం నుంచి ప్రయాణించాలనుకునేవారికి పెద్దలకు రూ.1,000, పిల్లలకు రూ.800 చార్జీలు వసూలు చేస్తారు.
గండిపోచమ్మ నుంచి వెళ్లాలనుకునేవారు పిల్లలకు రూ.2000, పెద్దలకు రూ.2,500 వసూలు చేస్తారు.

ఎన్ని బోట్లు అందుబాటులో ఉన్నాయి?
సాధారణ రోజుల్లో కేవలం 2 బోట్లు మాత్రమే ప్రయాణించేవి. ఒక్కోసారి మూడు తిరిగేవి. అయితే పర్యాటకుల సంఖ్యను భట్టి బోట్లను పెంచుతారు. గత విజయదశమి సందర్భంగా మూడు బోట్లను తిప్పారు. సంక్రాంతి సందర్భంగా ఏడు బోట్లను తీసుకెళ్లారు. ఇక పర్యాటకులు పెరిగితే ఒక్కోసారి 400 మంది ప్రయాణించిన రోజులు ఉన్నాయి.
వివిధ రకాల మొక్కలు, పక్షులు:
ఆంధ్రప్రదేశ్ లోని ఉభయగోదావరి జిల్లాలతో పాటు తెలంగాణ ఉమ్మడి ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో విహరించిన ఉన్న ఈ పాపికొండల మధ్య అనేక రకాల పక్షులు, జంతువులు కనిపిస్తాయి. పాపికొండలు రాగానే గోదావరి తక్కు వెడల్పుతో రెండు కొండలు ఎత్తుగా కనిపించడం ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అందువల్ల ప్రతి ఒక్కరు పాపికొండలు వెళ్లాలని కోరుకుంటారు.