
Photo Story: ‘ఒక్క ఛాన్స్ వస్తే నేనేంటో నిరూపిస్తా..’ అంటూ సినీ ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లు చెప్పే డైలాగ్ ఇదే. కానీ కొందరికి ఎన్ని అవకాశాలు వచ్చినా అదృష్టం కలిసి రాకపోతే అంతే సంగతులు. కానీ కష్టాలు, అవమానాలు ఎదుర్కొని నిలబడితే ఎన్నిటికైనా విజయం వర్తిస్తుంది.. అని నమ్ముకొని కొందరు చివరి వరకు ప్రయత్నిస్తూ ఉంటారు. అలా ఓ నటికి సినీ బ్యాక్రౌండ్ బోలెడంత ఉన్నా.. మొదట్లో ఆశించినంత విజయాలు రాలేదు.. కానీ ప్రయత్నాలు ఆపకుండా ముందుకు వెళ్లడంతో ఏకంగా జాతీయ అవార్డునే సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా ఇటీవల ఆమె నటించిన ఓ మూవీ పాన్ ఇండియా లెవల్లో సక్సెస్ సాధించింది. ఆమెకు చెందిన ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చాలా మంది తమ చిన్ననాటి సంగతులు గుర్తు చేసుకుంటూ సంతోషపడుతారు. హీరోయిన్లు కూడా తమ బాల్యం రోజుల నాటి విషయాలు అప్పుడప్పుడు బయటపెడుతుంటారు. లేటేస్టుగా ఓ సౌత్ నటి తన చైల్డిష్ పిక్ నెట్టింట్లో పెట్టింది. చిన్నప్పుడే ఎంతో క్యూట్ గా ఉన్న ఈమె పెరిగి పెద్దయ్యాక అదే లెవల్లో అందంగా తయారైంది. ఇప్పుడు సినిమాల్లో తన యాక్టింగ్ తో అదరగొడుతోంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుకు వచ్చారా? అయితే కిందికి వెళ్లి చూడండి..
ఈ అందాల భామ ఎవరో కాదు.. కీర్తి సురేశ్. తల్లిదండ్రులు సినిమా వాళ్లు కావడంతో ఇండస్ట్రీలోకి రావడానికి కీర్త సురేష్ కు పెద్దగా కష్టం కాలేదు. కానీ వచ్చీ రాగానే సక్సెస్ వరించలేదు. మొదట్లో ఆమె నటించిన కొన్ని సినిమాలు యావరేజ్ హిట్టు సాధించాయి. కానీ ఆ తరువాత జాతీయ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట్లో మలయాళంలో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో ‘నేను శైలజ’ అనే సినిమాతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత నానితో కలిసి నటించిన ‘నేను లోకల్’ మూవీలో కీర్తి సురేష్ ఆకట్టుకుంది.

ఆ తరువాత ‘మహానటి’తో జాతీయ అవార్డు సొంతం చేసుకున్న ఈమెకు అవకాశాలు దారులు పట్టాయి. అయితే మధ్యలో కొన్ని సినిమలు ప్లాప్ కావడంతో ఇక ఆమె సక్సెస్ కు దూరమయ్యారని అందరూ అనుకున్నారు. కాన ఇటీవల ఆమె నటించిన ‘దసరా’మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో మరోసారి కీర్తీ సురేష్ పేరు మారుమోగుతోంది. మళ్లీ మళ్లీ ఆమె పలు సినిమాల్లోనటించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో ఆమెకు విపరీతమైన ఫ్యాన్స్ పెరిగిపోయారు.