Pakistan: ఉద్యోగంలో నుంచి తీసేసారని సృహ తప్పిన ఉద్యోగి.. వైరల్ అవుతున్న వీడియో

పాకిస్థాన్ రాజధానిలోని ఇస్లామాబాద్‌లో మార్గల్లా హిల్స్ నేషనల్ పార్క్‌లోని అన్ని రెస్టారెంట్లను మూసి వేయాలని అక్కడ సుప్రీంకోర్టు ఆదేశించింది. బాగా ఫేమస్ అయిన మోనాల్ రెస్టారెంట్‌ కూడా ఇందులో ఉంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మోనల్ రెస్టారెంట్‌ను 2024 సెప్టెంబర్ 11 నుంచి మూసి వేస్తున్నట్లు ఆ రెస్టారెంట్ ప్రకటించింది.

Written By: Neelambaram, Updated On : August 24, 2024 4:52 pm

Pakistan

Follow us on

Pakistan: చాలామంది నెలవారీ జీతం మీద ఆధారపడి బ్రతుకుతుంటారు. దీంతో కంపెనీ పెద్దది అయిన చిన్నది అయిన జీతం కోసం జాయిన్ అవుతారు. వచ్చే జీతం కుటుంబ పోషణకు సరిపోవట్లేదని ఎక్కువ జీతం వస్తుందని స్టార్టప్ కంపెనీలో చేరతారు. ఆ కంపెనీ ఎప్పటి వరకు ఉంటుందో కూడా తెలియదు. నెలకి కొంచెం ఎక్కువ జీతం వస్తుంది కదా అనే ఆలోచనలో ఉంటారు. అయితే కంపెనీకి లాభాలు రావట్లేదని కొన్నిసార్లు ఆ సంస్థలను మూసేస్తారు. లేదా కొన్ని కారణాల వల్ల ఉద్యోగులను తీసేస్తారు. దీంతో ఆ ఉద్యోగులు చాలా ఆందోళన చెందుతారు. ఎందుకంటే నెలవారి జీతం మీద కుటుంబ పోషణ అంతా ఆధారపడి ఉంటుంది. ఒక్కసారిగా ఉద్యోగం పోతే వెంటనే దొరుకుతుందా? లేదా? అనే టెన్షన్ ఒక పక్క అయితే.. కుటుంబ పోషణ ఎలా అనే ఆందోళన ఒకటి. అయితే ఓ ఉద్యోగి తన టెర్మినేషన్ లెటర్ చూసి ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరీ వ్యక్తి.. ఉద్యోగంలో నుంచి ఎందుకు తీసేసారో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

పాకిస్థాన్ రాజధానిలోని ఇస్లామాబాద్‌లో మార్గల్లా హిల్స్ నేషనల్ పార్క్‌లోని అన్ని రెస్టారెంట్లను మూసి వేయాలని అక్కడ సుప్రీంకోర్టు ఆదేశించింది. బాగా ఫేమస్ అయిన మోనాల్ రెస్టారెంట్‌ కూడా ఇందులో ఉంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మోనల్ రెస్టారెంట్‌ను 2024 సెప్టెంబర్ 11 నుంచి మూసి వేస్తున్నట్లు ఆ రెస్టారెంట్ ప్రకటించింది. ఇలా సడెన్‌గా మూసివేస్తే ఆ భారం అంతా ఉద్యోగులపై పడుతుంది. ఉద్యోగులగా ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా నిరుద్యోగులగా మారుతున్నారు. అయితే ఇందులో ఓ ఉద్యోగి తన టెర్మినేషన్ లెటర్ చదువుతూ సృహ తప్పి కింద పడిపోయాడు. ఇకపై కుటుంబాన్ని పోషించం ఎలా అని బాధ పడ్డాడు. అతని ఏడుపు చూసి నెటిజన్లు భావోద్వేగానికి గురయ్యారు. ఉద్యోగం ఉన్నప్పుడే పోషణ కష్టమవుతుంది. అలాంటిది పోషణ లేనప్పుడు ఇంకా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలో అని బాధ ఎవరికైనా ఉంటుంది.

మోనాల్ రెస్టారెంట్ యజమాని లుక్మాన్ అలీ అఫ్జల్ బాధతో తన ఉద్యోగులకు లేఖ కూడా రాశారు. ఉద్యోగాలు పోయినందుకు బాధపడుతూ.. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించండి. తప్పకుండా వస్తాయని అతను ధైర్యం కల్పింఫ్రచారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు భావోద్వేగానికి గురయ్యారు. ఉద్యోగం పోతే మళ్లీ కొత్త ఉద్యోగం దొరికే సరికి టైమ్ పడుతుంది. కానీ దొరుకుతుంది. టెన్షన్ పడవద్దని కొందరు అంటున్నారు. మరికొందరు ఉద్యోగం లేకపోతే పిల్లలను పోషించడం ఎలా? వాళ్లకు ఇబ్బందులు వస్తాయని కామెంట్ చేస్తున్నారు. కుటుంబ పోషణకు తనకు తొందరగా ఉద్యోగం రావాలని దేవుడిని కోరుకుందాం.