Teja Sajja: చైల్డ్ ఆర్టిస్ట్ గా తేజ సజ్జ అప్పట్లో ఎంత రెమ్యూనరేషన్ తీసుకునేవాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. చిన్నతనంలోనే రికార్డు!

పలు థియేటర్స్ లో మెగాస్టార్ చిరంజీవి భారీ కటౌట్ పక్కనే, తేజ సజ్జ ఫోటో కూడా పెట్టారు. అంతే కాదు ఇంద్ర చిత్రం ప్రారంభ సన్నివేశంలో తేజ సజ్జ 'నేనున్నా నయనమ్మా' అంటూ బ్యాగ్ వేసిరి, చేతిలో కత్తి పట్టుకొచ్చి, తొడ కొట్టగానే థియేటర్స్ లో అభిమానుల చప్పట్లు, ఈలలతో దద్దరిల్లిపోయింది.

Written By: Vicky, Updated On : August 24, 2024 5:06 pm

Teja Sajja

Follow us on

Teja Sajja: బాలనటులుగా కెరీర్ ని ప్రారంభించిన ఎంతోమంది చిన్నతనం నుండే కోట్లాది మంది తెలుగు ప్రజలకు బాగా దగ్గరయ్యారు. అలాంటి బాలనటులే నేడు హీరోలుగా మారి సూపర్ స్టార్స్ గా ఎదిగారు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, కమల్ హాసన్, తరుణ్ ఇలా ఎంతో మంది అలా వచ్చిన వారే. అయితే వీరి దారిలోనే ఇప్పుడు యంగ్ హీరో తేజ సజ్జ కూడా నడవబోతున్నాడా అంటే అవుననే అనాలి. బాలనటుడిగా ఈ కుర్రాడు చిన్నతనం చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ కిడ్ గా ప్రేక్షకుల దృష్టిలో బాగా పడ్డాడు. ముఖ్యంగా తేజ సజ్జ ‘ఇంద్ర’ చిత్రం ద్వారా ఎలాంటి క్రేజ్ సంపాదించాడో మన అందరికీ తెలిసిందే. రీసెంట్ గా ఈ చిత్రం థియేటర్స్ లో మరోసారి రిలీజ్ అయ్యింది.

పలు థియేటర్స్ లో మెగాస్టార్ చిరంజీవి భారీ కటౌట్ పక్కనే, తేజ సజ్జ ఫోటో కూడా పెట్టారు. అంతే కాదు ఇంద్ర చిత్రం ప్రారంభ సన్నివేశంలో తేజ సజ్జ ‘నేనున్నా నయనమ్మా’ అంటూ బ్యాగ్ వేసిరి, చేతిలో కత్తి పట్టుకొచ్చి, తొడ కొట్టగానే థియేటర్స్ లో అభిమానుల చప్పట్లు, ఈలలతో దద్దరిల్లిపోయింది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆరోజుల్లో ఈ సన్నివేశం ఏ స్థాయిలో హిట్ అయ్యిందో అనేది. ఇంద్ర చిత్రానికి ముందు తేజ సజ్జ బాలనటుడిగా అనేక సినిమాలు చేసాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘చూడాలని ఉంది’ అనే చిత్రం ద్వారా తేజా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. ఇందులో చిరంజీవి కొడుకుగా తేజ ఎంత అద్భుతంగా నటించాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ సినిమా తర్వాత ఆయన వరుసగా ‘రాజకుమారుడు’, ‘కలిసుందాం రా’, ‘యువరాజు’, ‘బాచి’, ‘దీవించండి’, ‘ప్రేమ సందడి’, ‘ఆకాశ వీధిలో’, ‘ఛత్రపతి’ ఇలా ఒక్కటా రెండా ఎన్నో సినిమాల్లో బాలనటుడిగా నటించాడు. అయితే ఆరోజుల్లో స్టార్ కిడ్ గా పిలవబడే తేజ కి ఒక్క రోజు షూటింగ్ గాను 15 వేల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చేవారట.

అంటే ఎన్ని రోజులు షూటింగ్ చేస్తే, అన్ని 15 వేల రూపాయిలు ఇవ్వాలి అన్నమాట. ఒక సినిమాకి ఆయన నెల రోజులు పని చేస్తే నెలకి నాలుగు లక్షల 50 వేల రూపాయిలు వస్తుందన్నమాట. చిన్నతనంలోనే తేజ సజ్జ ఈ రేంజ్ లో సంపాదించేవాడు. ఇకపోతే పెద్దయ్యాక ఆయన ‘ఓ బేబీ’ చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన హీరోగా చేసిన ‘జాంబీ రెడ్డి’, ‘అద్భుతం’, ‘హనుమాన్’ చిత్రాలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో మన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా హనుమాన్ అయితే ఏకంగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టింది. ప్రస్తుతం ఆయన ‘మిరాయ్’ అనే పాన్ ఇండియన్ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఆయన 7 కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.