‘కరోనా’ను జయించిన వారికి దారుణంగా ఊడిపోతున్న జుట్టు.. ప్రతి నలుగురిలో ఒకరికి?

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. కరోనా నుంచి కోలుకున్నా చాలామంది ఇతర సమస్యలతో బాధ పడుతున్నారు. కొందరు వైరస్ నుంచి కోలుకున్న తరువాత రుచి, వాసనను పసిగట్టలేక పోతుంటే మరికొందరు జుట్టు సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. తాజాగా ఒక సర్వేలో కరోనా సోకిన వాళ్ల జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతున్నట్టు తేలింది. మార్చిలో ఒక మహిళ కరోనా బారిన పడగా వైరస్ […]

Written By: Kusuma Aggunna, Updated On : August 11, 2020 5:50 pm
Follow us on

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. కరోనా నుంచి కోలుకున్నా చాలామంది ఇతర సమస్యలతో బాధ పడుతున్నారు. కొందరు వైరస్ నుంచి కోలుకున్న తరువాత రుచి, వాసనను పసిగట్టలేక పోతుంటే మరికొందరు జుట్టు సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. తాజాగా ఒక సర్వేలో కరోనా సోకిన వాళ్ల జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతున్నట్టు తేలింది. మార్చిలో ఒక మహిళ కరోనా బారిన పడగా వైరస్ నుంచి కోలుకున్న తరువాత తలపై ఉన్న జుట్టు చాలావరకు ఊడిపోయింది.

సదరు మహిళకు ఇప్పటికే సగం కంటే ఎక్కువ జుట్టు ఊడిపోవడంతో తీవ్ర భయాందోళనకు లోనవుతోంది. ఎసెక్స్కు ప్రాంతానికి చెందిన గ్రూడ్ డుస్కే అనే మహిళ దిండుపై కుచ్చులు కుచ్చులుగా పడిపోయిన జుట్టును చూసి తీవ్ర ఆందోళనకు గురయ్యానని చెప్పారు. కరోనా సోకిన ఇతర బాధితులు కూడా జుట్టు రాలిపోతుందని ఆరోపణలు వ్యక్తం చేయడం గమనార్హం. కరోనా నుంచి కోలుకున్న వాళ్లపై 1500 మందిపై సర్వే చేసి పరిశోధకులు ఫలితాలను వెల్లడించారు.

కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో నెత్తి మీద లేదా కనుబొమ్మల మధ్య జుట్టు రాలుతున్నట్టు తాము గుర్తించామని… ఫేస్ బుక్ ద్వారా చేసిన సర్వేలో 27 శాతం మందిలో ఈ సమస్యను గుర్తించామని తెలిపారు. తాత్కాలిక ఒత్తిడి వల్ల ఈ సమస్య ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు చెప్పారు. ఈ సమస్యను telogen effluvium అంటారని… కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో ప్రతి నలుగురిలో ఒకరిలో ఈ సమస్యను గుర్తించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.