https://oktelugu.com/

అర్ధరాత్రి రఫేల్స్ తో భారత్ సీక్రెట్ ఫైట్?

‘ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా’ అన్న పాపులర్ సినిమా డైలాగ్ ను భారత్ అక్షరాల నిజం చేస్తోంది. లేట్ గా భారత్ లోకి డెలివరీ అయిన ఫ్రాన్స్ తయారు చేసిన ప్రపంచంలోనే అత్యాధునిక యుద్ధ విమానాలు రఫేల్స్ అప్పుడే ట్రయల్ ఫైట్ మొదలుపెట్టాయి. సరిహద్దుల్లో చైనా భారీగా యుద్ధ విమానాలను మోహరిస్తున్న నేపథ్యంలో అంతే సన్నాహకంగా భారత్ ‘రఫేల్స్’తో సీక్రెట్ ఫైట్ ను అర్ధరాత్రి నిర్వహిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. Also Read: సచిన్ పైలట్ తిరిగి […]

Written By:
  • NARESH
  • , Updated On : August 11, 2020 / 05:54 PM IST
    Follow us on


    ‘ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా’ అన్న పాపులర్ సినిమా డైలాగ్ ను భారత్ అక్షరాల నిజం చేస్తోంది. లేట్ గా భారత్ లోకి డెలివరీ అయిన ఫ్రాన్స్ తయారు చేసిన ప్రపంచంలోనే అత్యాధునిక యుద్ధ విమానాలు రఫేల్స్ అప్పుడే ట్రయల్ ఫైట్ మొదలుపెట్టాయి. సరిహద్దుల్లో చైనా భారీగా యుద్ధ విమానాలను మోహరిస్తున్న నేపథ్యంలో అంతే సన్నాహకంగా భారత్ ‘రఫేల్స్’తో సీక్రెట్ ఫైట్ ను అర్ధరాత్రి నిర్వహిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

    Also Read: సచిన్ పైలట్ తిరిగి రాక దేనికి సంకేతం?

    జూలై 29న ఫ్రాన్స్ దేశం భారత్ కు ఐదు రఫేల్ యుద్ధ విమానాలను డెలివరీ చేసింది. భారత్ కొత్తగా కొనుగోలు చేసిన ఈ ఐదు రఫేల్ యుద్ధ విమానాలు ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లోని హిమాలయ మంచుకొండలపై అర్ధరాత్రి ఎగురుతూ యుద్ధ సన్నహాలు నిర్వహిస్తున్నాయని తెలిసింది.

    రక్షణ శాఖ నివేదికల ప్రకారం.. ఐదు రాఫెల్ జెట్స్ హిమాచల్ ప్రదేశ్ లోని పర్వత భూభాగంలో రాత్రి వేళ ఎలా యుద్ధం చేయాలనే దానిపై పైలెట్స్ కు శిక్షణ ఇస్తున్నారని సమాచారం.

    చైనాతో భారత్ కు 1597 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన నియంత్రణ రేఖ ఉంది. ప్రస్తుతం చైనా భారీగా లఢక్ సరిహద్దుల్లోకి యుద్ధ విమానాలను తరలిస్తోంది. దీంతో ప్రపంచంలో అత్యాధునిక యుద్ధ విమానాలైన రఫేల్స్ ద్వారా చైనా శత్రు సైన్యాలపై దాడికి దిగేలా శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది.

    Also Read: బీజేపీ కరోనా వంటిది అయితే… వైసీపీ కి ఏ వ్యాధి పేరు పెట్టాలి నాని?

    రఫేల్ ద్వారా గాల్లోనే క్షిపణి ప్రయోగాలు.. భూమిపై లక్ష్యాలు.. ఆకాశంలోని లక్షణాలు.. ఇక గాల్లోనే ఇంధన నింపుకునే సౌలభ్యాలు ఎన్నో ఉన్నాయి.నింగి నేలపై అరవీర భయంకరమైన ఈ రఫేల్స్ కు అన్ని క్షిపణులను అమర్చి లఢక్ సరిహద్దుల్లో సిద్ధంగా ఉంచారు. మనకంటే బలమైన.. ఎక్కువ యుద్ధ విమానాలున్న చైనా వాయుసేనకు ఈ రఫేల్స్ తో చెక్ చెప్పే సామర్థ్యం భారత్ కు ఉంది.

    ఓ వైపు చైనా.. మరోవైపు పాకిస్తాన్ లతో వివాదాల నేపథ్యంలో మొదటి బ్యాచ్ రఫేల్ జెట్ల రాక భారత దేశ వాయుసేన శక్తిని అమాంతం పెంచేసింది. దీంతో యుద్ధానికి ముందే వీటి సన్నద్థతపై భారత్ హిమాలయ పర్వతాల్లోనే ప్రయోగాలు చేస్తుండడం విశేషం.

    -నరేశ్