https://oktelugu.com/

మళ్ళీ తెర పైకి ‘రామాయణం’.. కీలక పాత్రలో ఎన్టీఆర్ ?

అత్యంత భారీ బడ్జెట్ తో నితీశ్ తివారీ, రవి ఉద్యవార్ దర్శకత్వంలో ‘రామాయణం’ అనే సినిమా రాబోతోందనే వార్త గత ఏడాది విపరీతంగా వైరల్ అయింది. ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తో కలిసి బాలీవుడ్ నిర్మాతలు మధు మంతెన, నమిత్ మల్హోత్రాలు ఈ ‘రామాయణం’ను భారీ బడ్జెట్ సినిమాగా నిర్మించబోతున్నారని ఆ వార్త సారాంశం. అయితే ఈ సినిమా గురించి మళ్ళీ అప్ డేట్ లేదు. కానీ తాజాగా బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం […]

Written By:
  • admin
  • , Updated On : August 13, 2020 10:02 am
    Follow us on


    అత్యంత భారీ బడ్జెట్ తో నితీశ్ తివారీ, రవి ఉద్యవార్ దర్శకత్వంలో ‘రామాయణం’ అనే సినిమా రాబోతోందనే వార్త గత ఏడాది విపరీతంగా వైరల్ అయింది. ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తో కలిసి బాలీవుడ్ నిర్మాతలు మధు మంతెన, నమిత్ మల్హోత్రాలు ఈ ‘రామాయణం’ను భారీ బడ్జెట్ సినిమాగా నిర్మించబోతున్నారని ఆ వార్త సారాంశం. అయితే ఈ సినిమా గురించి మళ్ళీ అప్ డేట్ లేదు. కానీ తాజాగా బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందట. ఈ చిత్రంలో ఎంతోమంది ప్రముఖులు నటించనున్నారని, కాకపోతే సౌత్ వరకూ ఇక్కడి హీరోలను, బాలీవుడ్ వరకూ అక్కడి హీరోలను తీసుకోవాలనేది మేకర్స్ ప్లాన్ అని తెలుస్తోంది.

    Also Read: సినిమాకు వంద కోట్లు.. దేశంలో ప్రభాస్ ఒక్కడే!

    ఎలాగూ రామాయణం అనగానే బోలెడన్ని పాత్రలుంటాయి కాబట్టి.. అందరి స్టార్ హీరోలకు ఈ సినిమాలో కీలకమైన పాత్రలు ఉంటాయి. అయితే ఈ రామాయణంలో ఎంతో కీలకమైన పాత్ర రావణుడుది. ఈ పాత్రను చేయాలంటే అది సామాన్యమైన విషయం కాదు, అందుకే ఈ పాత్ర విషయంలోనే బాలీవుడ్ లో ఏ స్టార్ ను తీసుకోవాలో మేకర్స్ కు ఇంకా క్లారిటీ లేదట. కానీ సల్మాన్ ఖాన్ అయితే బాగుంటుందనేది ఒక ఆలోచన. మరి సౌత్ లో ఆ పాత్రను ఎవరు పోషించగలరో అని మేకర్స్ ఆసక్తిగా వెతుకుతున్నారు.

    Also Read: చిరుతో చరణ్‌ ఫైటింగ్‌…

    కాగా రావణుడి పాత్రకి ఎన్టీఆర్ అయితేనే న్యాయం చేస్తాడని జూనియర్ ఎన్టీఆర్ చేత ఆ పాత్ర చేయించాలని మేకర్స్ ను కోరుతున్నారాట ఇక్కడి వారి సినీ సన్నిహితులు. ఏమైనా ఈ తరంలో హిస్టారికల్ పాత్రలు చేయాలంటే ఒక్క ఎన్టీఆరే అనేది ఇప్పటికే రుజువు అయింది. దీనికి తోడు పౌరాణిక చిత్రాలకు సరిపోగల, అలాంటి సినిమాల్లో నటించాలనే ఆశ ఉన్న హీరోలు కూడా మన సౌత్ లో పెద్దగా లేరు. అందుకే అందరి చూపులు ఇప్పుడు ఎన్టీఆర్ పైకే వెళ్తున్నాయి. నిజంగా ఈ జనరేషన్ లో ఇలాంటి హిస్టారికల్ పాత్రలు చెయ్యగల సామర్ధ్యం ఒక్క ఎన్టీఆర్ కే ఉంది. మరి ఎన్టీఆర్ ఆ పాత్ర చేస్తాడా !