https://oktelugu.com/

Puneeth Rajkumar: ఎన్టీఆర్ ను చూడగానే కన్నీళ్లు ఆగాక శివరాజ్ ఏం చేశాడంటే?

Puneeth Rajkumar:కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం ఆ శాండిల్ వుడ్ నే కాదు.. టాలీవుడ్ కోలీవుడ్, మాలీవుడ్ ను శోకసంద్రంలో ముంచింది. పునీత్ రాజ్ కుమార్ కు ఎంతో సాన్నిహిత్యం ఉన్న మన తెలుగు హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయాడు. నేరుగా బెంగళూరుకు వెళ్లి తన స్నేహితుడిని కడసారి చూసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్-పునీత్ రాజ్ కుమార్ కలుస్తుంటారు. ఈ క్రమంలోనే తన […]

Written By:
  • NARESH
  • , Updated On : October 30, 2021 / 05:00 PM IST
    Follow us on

    Puneeth Rajkumar:కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం ఆ శాండిల్ వుడ్ నే కాదు.. టాలీవుడ్ కోలీవుడ్, మాలీవుడ్ ను శోకసంద్రంలో ముంచింది. పునీత్ రాజ్ కుమార్ కు ఎంతో సాన్నిహిత్యం ఉన్న మన తెలుగు హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయాడు. నేరుగా బెంగళూరుకు వెళ్లి తన స్నేహితుడిని కడసారి చూసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కన్నీళ్లు పెట్టుకున్నారు.

    హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్-పునీత్ రాజ్ కుమార్ కలుస్తుంటారు. ఈ క్రమంలోనే తన ప్రాణ స్నేహితుడు కన్నడ నటుడు పునీత్ మరణాన్ని ఎన్టీఆర్ తట్టుకోలేకపోయాడు. బెంగళూరు వెళ్లి పునీత్ పార్తీవ దేహాన్ని సందర్శించారు. నివాళులర్పించారు.

    కంఠీరవ మైదానంలోకి వచ్చిన ఎన్టీఆర్ పునీత్ కు శ్రద్ధాంజలి ఘటించారు. పునీత్ పార్థీవ దేహాన్ని చూ్తూ భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం తారక్ ను చూసిన పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు. ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయ్యారు. వెంటనే తారక్ ను ఆలింగనం చేసుకొని ఓదార్చారు.

    ఇక ఎన్టీఆర్ వెంట కేజీఎఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ ఉన్నారు. వీరిద్దరూ త్వరలో సినిమా చేయబోతున్నారు. ఎన్టీఆర్ కు, పునీత్ కు మధ్య మంచి స్నేహం ఉంది. అందుకే పునీత్ మరణాన్ని ఎన్టీఆర్ జీర్ణించుకోలేకపోయారు.

    వీడియో