Uttar Pradesh Noida: దేశంలో లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలొచ్చిన ఆకృత్యాలు ఆగడం లేదు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు ఆడవారికి రక్షణ కరువవుతోంది. ఈ నేపథ్యంలో వచ్చిన నిర్భయ, దిశ లాంటి చట్టాలు కూడా చచ్చుబండలే అవుతున్నాయి. సామాన్యులకు న్యాయం అందని ద్రాక్షగానే మిగులుతోంది. మనిషిలో రాక్షసత్వం పెరుగుతూనే ఉంది. ఫలితంగా మహిళలపై రోజుకో దారుణం వెలుగు చూస్తూనే ఉంది. అయినా పాలకుల్లో మార్పులు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా నిష్ర్పయోజనమే అవుతున్నాయని తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్ లో ఓ దారుణం చోటుచేసుకుంది. ఓ 17 ఏళ్ల బాలికపై 81 ఏళ్ల వృద్ధుడు డిజిటల్ రేప్ చేశారు. డిజిటల్ రేప్ అంటే ప్రైవేటు భాగాలను చేతివేళ్లు, కాలి వేళ్లతో బలవంతంగా చొప్పించడం. సదరు వృద్ధుడు ఆర్టిస్ట్ కమ్ టీచర్. విద్యార్థినికి పాఠాలు బోధించి ఆమెను భావి భారత పౌరురాలుగా చేయడం బాధ్యత మరిచి ఇలా లైంగిక దాడికి తెగబడటం సంచలనం సృష్టించింది. ఒకటి కాదురెండు కాదు ఏకంగా ఏడేళ్లు గా ఆమెపై ఈ అఘాయిత్యానికి పాల్పడుతూనే ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Kannada TV Actress Chethana Raj: అందం కోసం ప్రాకులాట, ప్రాణాలతో హీరోయిన్ల చెలగాటం !
దీంతో అతడిపై 376, 323, 506 సెక్షన్ల కింద అత్యాచారం, గాయపరచడం, బెదిరింపు తదితర కేసులు నమదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. బాలిక సంరక్షుడితో కలిసి ఉంటోంది. ఇరవై ఏళ్లుగా నిందితుడితో స్నేహం చేస్తున్నాడు. దాన్ని అడ్వాంటేజీగా తీసుకుని నిందితుడు బాలికపై ఇలా దాడి చేసినట్లు సంరక్షుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలికను ఇలా డిజిటల్ రేప్ చేయడంతో బాలిక భయపడింది. కానీ ఆమెలో వచ్చిన ధైర్యంతో సంరక్షుడికి నిజం చెప్పింది.
ఈ క్రమంలో నిందితుడి దుశ్చర్యలను వీడియో తీసింది. సాక్ష్యాధారాలు బలంగా ఉండేందుకు ఆధారాలు సంపాదించింది. ఇక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ మేరకు సెక్టార్ 39 స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ నిందితుడిని కోర్టులో హాజరు పరిచినట్లు పేర్కొన్నారు.
Also Read:NTR Best Dialogues: ఎన్టీఆర్ సినీ కెరీర్ లోనే బెస్ట్ 3 డైలాగ్స్ ఇవే