Kannada TV Actress Chethana Raj: సినిమా నటీమణులకు అందం కోసం ఎందుకు అంత ప్రాకులాట ?, అందమైన ఆకృతి కోసం ప్లాస్టిక్ సర్జరీని ఆశ్రయించిన ఓ నటి తన ప్రాణాలను కోల్పోవడం ఎంత దారుణమైన విషయం ?. సినిమా నటి అనగానే గ్లామర్ ప్రపంచం, లగ్జరీ లైఫ్ అనుకుంటాం. కానీ, ఆ లగ్జరీ వెనుక అనేక సర్జరీలు ఉంటాయి. వాళ్ళ గ్లామర్ వెనుక, ప్రాణాంతకమైన తెగింపు ఉంటుంది. పెద్ద హీరోయిన్ అయిపోవాలని యువ కన్నడ నటి చేతన రాజ్ కలలు కంది.
అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. నిరాశే మిగిలింది. అందం రెట్టింపు చేసుకుంటే.. కెరీర్ సెట్ అవుతుందని ఆశ పడింది. చివరకు ప్రాణాలనే కోల్పోయింది. చేతన రాజ్ ఫ్యాట్ ఫ్రీ సర్జరీ కోసం బెంగళూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్ ను సంప్రదించింది. ఈ నెల 16న సర్జరీ కోసం ఆమె ఆసుపత్రిలో చేరింది. సర్జరీ అయ్యాక సడెన్ గా ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఆమె ఊపిరితిత్తుల్లోకి ఎక్కువగా నీరు చేరిపోయింది. ఒక్కసారిగా ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది.
Also Read: NTR Best Dialogues: ఎన్టీఆర్ సినీ కెరీర్ లోనే బెస్ట్ 3 డైలాగ్స్ ఇవే
వైద్యులు తమ వంతు ప్రయత్నాలు చేసినా, ఆమె ప్రాణాలు కాపాడలేకపోయారు. వైద్యుల నిర్లక్ష్యమే తమ కుమార్తె అకాల మరణానికి కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిజానికి అసలు కారణం ఎవరు ? ప్లాస్టిక్ సర్జరీలను చూసి ఛాన్స్ లు ఇచ్చే సినిమా వాళ్ళదా ?, లేక, సరైన పరికరాలు, నిపుణులు లేకుండా వైద్యం చేసిన వైద్యులదా ? నిజానికి ఇలాంటి సర్జరీలు ఒక్క చేతన రాజ్ మాత్రమే కాదు, ఈ మధ్య ప్రతి ఇద్దరు హీరోయిన్స్ లో ఒకరు చేయించుకుంటున్నారు.
రిస్క్ అని తెలిసినా, కెరీర్ కోసం ధైర్యం చేస్తున్నారు. సన్నని శరీరాకృతి కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టడం ఎంత విచిత్రం ! అసలు హీరోయిన్లు బరువు ఉంటే ఏమవుతుంది ?, నిజానికి సావిత్రి, జమున కాలంలో హీరోయిన్లు కాస్త కండ చేసి బొద్దుగా ఉండేవాళ్ళు. వాళ్ళను ఇప్పటికీ ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. కానీ, ఇప్పుడంతా స్లిమ్ గా సన్నగా ఉంటేనే ఇష్ట పడుతున్నారని ఓ అబద్దపు చట్రంలో ఇరుక్కుపోయాం.
అందుకే హీరోయిన్లు బరువు విషయంలో అతి జాగ్రత్త చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే పొరపాటున బరువు పెరిగితే సైడ్ క్యారెక్టర్స్ కే పరిమితం అవ్వాల్సి వస్తోంది. పైగా ఎన్నో బ్యాడ్ కామెంట్స్ వినాల్సి వస్తోంది. వీటికి భయపడే హీరోయిన్లు సర్జరీలను నమ్ముకుంటున్నారు. తమ ఆరోగ్యాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. శరీరాకృతిని చూసి కాకుండా, టాలెంట్ ను చూసి మేకర్స్ అవకాశాలు ఇస్తే.. చేతన్ రాజ్ కి పట్టిన దుస్థితి ఏ నటికి పట్టదు. మేకర్స్ ఆ దిశగా ఆలోచించాలని కోరుకుందాం.
Also Read:Dimple Hayathi: బాలయ్య బాబుతో హాట్ బాంబ్ ఘాటు స్టెప్స్ !
Recommended Videos