New year’s eve : కొత్త సంవత్సరం సందర్భంగా చాలా ఆంక్షలు విధిస్తున్నారు అధికారులు. ఇక ఇయర్ ఎండ్ అంటూ చాలా మంది ఈ రోజు హంగామా చేస్తుంటారు. సెలబ్రేషన్స్ సందర్భంగా ఎన్నో గొడవలు, యాక్సిడెంట్లు కూడా కామన్ గా జరుగుతుంటాయి. స్పీడ్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటివి మరింత ఎక్కువ జరుగుతాయి. అయితే ఈ సారి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు ప్రతి ఏరియాలో కూడా కఠినమైన ఆంక్షలు విధించారు అధికారులు. మరి ఢిల్లీ ఆంక్షలు ఎలా ఉన్నాయో ఓ సారి చూసేద్దాం.
కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున 5 గంటల వరకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఎంట్రీ స్టిక్కర్లను కలిగి ఉన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తారట. ఇలాంటి స్టికర్లు లేని వాహనాలను కన్నాట్ ప్లేస్‌లోకి అనుమతించబోమని అధికారులు సోమవారం తెలిపారు. నైట్‌క్లబ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లలో పార్టీ కార్యక్రమాల నిర్వాహకులకు పోలీసులు కేవలం 2,500 స్టిక్కర్లను మాత్రమే జారీ చేశారు. ఇక రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ ఎగ్జిట్ గేట్లను రాత్రి 9 గంటల నుంచి మూసివేస్తామని పోలీసులు తెలిపారు. రాత్రి 7 గంటల తర్వాత, కన్నాట్ ప్లేస్‌లోకి బస్సులను అనుమతించరు.
“కన్నాట్ ప్లేస్‌లోని పార్టీ నిర్వాహకులకు 2,500 స్టిక్కర్లు ఒక్కొక్కటి ₹100కి విక్రయించారు. నిర్వాహకులు ఈ ప్రత్యేక ప్రవేశ పాస్‌లను వారి అతిథులకు జారీ చేస్తారు. వారు మంగళవారం రాత్రి 8 గంటల నుంచి కన్నాట్ ప్లేస్ సర్కిల్ వెలుపలి, మధ్య, లోపలి సర్కిల్‌లలోకి ప్రవేశించడానికి వారి వాహనాలపై వాటిని చూపించాలి. ఈ స్టిక్కర్‌లు నిషేధిత ప్రాంతాలకు మించి వాహనాలను, కన్నాట్ ప్లేస్‌లో న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NDMC) నిర్వహించే నిర్ణీత స్థలాలలో పార్కింగ్ చేయడానికి అనుమతిస్తారు. వాహనాలను పార్క్ చేయడానికి వాహన యజమానులు పార్కింగ్ అటెండెంట్లకు చెల్లించాల్సి ఉంటుంది” అని అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్ జోన్ 2) దినేష్ కుమార్ గుప్తా తెలిపారు.
ఇండియా గేట్, కన్నాట్ ప్లేస్, సెంట్రల్, సౌత్ నగరంలోని ఇతర ప్రాంతాల్లోని 50కి పైగా పార్టీ వేదికల వద్ద ర్యాష్, డ్రంక్ డ్రైవింగ్ కోసం రోడ్లను పర్యవేక్షించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఒక్క కన్నాట్ ప్లేస్ , ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లో నాలుగు వందల మంది ట్రాఫిక్ సిబ్బందిని మోహరిస్తారు. కన్నాట్ ప్లేస్, దాని కనెక్ట్ రేడియల్‌లలో “నో-ఎంట్రీ” పరిమితులు మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతాయి. చెల్లుబాటు అయ్యే ఎంట్రీ స్టిక్కర్లు మినహా వాహనాలకు సీలు వేసే 12 పాయింట్లను ట్రాఫిక్ పోలీసులు సిద్ధం చేశారు. ఇండియా గేట్ సర్కిల్ చుట్టూ 14 పాయింట్లు, న్యూ ఢిల్లీ జిల్లాలో 135 పాయింట్లు ఉంటాయని గుప్తా తెలిపారు.
“రాష్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద వారి దృష్టి ఉంటుందన్నారు పోలీసులు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిని తనిఖీ చేసేందుకు 46 ప్రత్యేక ట్రాఫిక్ ప్రాసిక్యూషన్ బృందాలను ఆల్కామీటర్‌లతో ఏర్పాటు చేస్తున్నారు.. చలాన్ కోసం యాభై మోటార్ సైకిల్ బృందాలను మోహరిస్తారు. అనధికార ప్రదేశాలలో పార్క్ చేసిన వాహనాలను తొలగించడానికి 16 క్రేన్‌లను మోహరిస్తామని ”అన్నారాయన. ఢిల్లీ పోలీసుల భద్రతా ఏర్పాట్లలో లైవ్ CCTV పర్యవేక్షణ, ఇద్దరు వైద్యులు, ఒక ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్, 1,000 మందికి పైగా పోలీసులు, CAPF సిబ్బంది, బాంబ్ స్క్వాడ్‌లు ఉన్నాయి.