Aids Vaccine: ఆసియా, ఆఫ్రికా అని తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి ఎయిడ్స్ నివారణ పై.. ఎయిడ్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం చేసింది. బహిరంగ ప్రదేశాలలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. నాడు పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా అనే యాడ్ విస్తృతంగా ప్రచారం, ప్రసారం కావడానికి ప్రధాన కారణం కూడా అదే. అయితే ఎయిడ్స్ వల్ల నాటి రోజుల్లో లక్షలాది మంది చనిపోయారు. ముఖ్యంగా ఆఫ్రికా దేశాలలో చాలామంది కన్నుమూశారు. ఎయిడ్స్ వచ్చిన వారిని సామాజికంగా బహిష్కరించడంతో నరకం చూశారు. అందువల్లే ఎయిడ్స్ పై ప్రపంచ దేశాలు యుద్ధం ప్రకటించాయి. నివారణకు విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాయి. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే సెలబ్రిటీలు తమ బాధ్యతగా ఎయిడ్స్ నివారణ పై ప్రచారం నిర్వహించారు. ఎయిడ్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తమవంతుగా వివరించే ప్రయత్నం చేశారు.
పరిశోధనల తర్వాత..
2009 తర్వాత జరిగిన పరిశోధనల అనంతరం ఎయిడ్స్ నివారణకు మందులు అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల ఎయిడ్స్ తగ్గకపోయినప్పటికీ.. రోగి జీవిత కాలాన్ని పెంపొందించే అవకాశం దక్కింది. పరిశోధనలు నిత్యం జరగడం వల్ల కొత్త కొత్త మందులు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఎన్ని మందులు అందుబాటులోకి వచ్చినా ఎయిడ్స్ నివారణ మాత్రమే సాధ్యమైంది. రోగి జీవితకాలం పెంపొందించడం మాత్రమే సాధ్యపడింది. కానీ ఎయిడ్స్ నిర్మూలన అనేది వీలు కాలేదు. అయితే ఇప్పుడు ప్రపంచానికి శుభవార్త చెప్పే విధంగా ఎయిడ్స్ శాశ్వత నిర్మూలనకు వ్యాక్సిన్ వచ్చింది. గిలీడ్ సైన్సెస్ అనే సంస్థ Lenacappavir అనే టీకాకు US FDA ఆమోదం తెలిపింది.. వచ్చే మూడు సంవత్సరాలలో ఈ టీకా 20 లక్షల మంది దాకా చేరుతుంది. దక్షిణాఫ్రికా, టాంజానియా ప్రాంతాలలో ఈ వ్యాక్సిన్ కు సంబంధించి ట్రయల్ నిర్వహించారు. దీనివల్ల మెరుగైన ఫలితాలు వచ్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దక్షిణాఫ్రికా, టాంజానియా లో ఎయిడ్స్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మరణాలు కూడా అదే సంఖ్యలో చోటు చేసుకుంటున్నాయి. అందువల్లే ఇక్కడ ట్రయల్స్ నిర్వహించారు. అవి విజయవంతం కావడంతో ఎయిడ్స్ టీకాకు US FDA ఆమోదం తెలిపింది.. ప్రతి ఏడాది రెండుసార్లు ఈ టీకా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దీని ధర ఎంత అనేది బయటికి చెప్పలేదు. వ్యాక్సిన్ బయటికి రావడంతో.. మరో మూడు నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. రకరకాల అపహాలు చెలరేగుతున్నాయి. వ్యాక్సిన్ ధర పేదలకు అందుబాటులో ఉండదని.. కేవలం శ్రీమంతులకు మాత్రమే దీనిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని.. ఐక్యరాజ్యసమితి అనుబంధ ఆరోగ్య విభాగం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ వ్యాక్సిన్ ను పేద దేశాలకు ఉచితంగా అందించాలనే డిమాండ్లు మొదలయ్యాయి. అయితే ఈ వ్యాక్సిన్ ను కేవలం గిలీడ్ సైన్సెస్ మాత్రమే అభివృద్ధి చేసిన నేపథ్యంలో.. దానికి మాత్రమే పేటెంట్ రైట్స్ ఉంటాయని తెలుస్తోంది. ఈ వ్యాక్సిన్ తయారీకి ఆ కంపెనీ భారీగా నగదు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.
ఇప్పుడు అంతమంది బతుకుతున్నారు
ఎయిడ్స్ 1983లో వెలుగులోకి వచ్చింది. దీనిని మొట్టమొదటిసారిగా అమెరికాలో గుర్తించారు. ఆ తర్వాత ఈ వ్యాధి అన్ని దేశాలకు విస్తరించింది. ఎయిడ్స్ అనేది ప్రపంచ దేశాలకు పెను ముప్పుగా మారింది. దీంతో ఎయిడ్స్ కు మందు లేదు.. నివారణ మాత్రమే సాధ్యం అనే నినాదం అప్పట్లో పుట్టుకొచ్చింది. ఎయిడ్స్ వల్ల ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 4.2 కోట్ల మంది చనిపోయారు. మొత్తంగా 8.8 కోట్ల మందికి ఈ వ్యాధి సోకింది. గత ఏడాది చివరి నాటికి నాలుగు కోట్ల మంది ఎయిడ్స్ తోనే బతికీడుస్తున్నారు.. వారు మందులు వాడుతూ తమ జీవిత కాలాన్ని పెంచుకుంటున్నారు.