కరోనా మృతదేహాల్లో ఈ కొత్త లక్షణాలు!

ప్రపంచ దేశాల ప్రజలు కరోనా మహమ్మారి ధాటికి చిగురుటాకులా గజగజా వణుకుతున్న సంగతి తెలిసిందే. వైరస్ ను వీలైనంత తక్కువ సమయంలో కట్టడి చేయాలనే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు వైరస్ గురించి అనేక పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల్లో ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శాస్త్రవేత్తలు తాజాగా కరోనాతో మృతి చెందిన వారికి శవ పరీక్షలు నిర్వహించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. Also Read : ఆ పదార్దాలపై మూడు వారాల పాటు కరోనా జీవించే ఉంటుందట! […]

Written By: Navya, Updated On : August 25, 2020 10:01 am
Follow us on

ప్రపంచ దేశాల ప్రజలు కరోనా మహమ్మారి ధాటికి చిగురుటాకులా గజగజా వణుకుతున్న సంగతి తెలిసిందే. వైరస్ ను వీలైనంత తక్కువ సమయంలో కట్టడి చేయాలనే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు వైరస్ గురించి అనేక పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల్లో ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శాస్త్రవేత్తలు తాజాగా కరోనాతో మృతి చెందిన వారికి శవ పరీక్షలు నిర్వహించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Also Read : ఆ పదార్దాలపై మూడు వారాల పాటు కరోనా జీవించే ఉంటుందట!

లండన్ శాస్త్రవేత్తలు కరోనా రోగుల మృతదేహాలపై పరిశోధనలు చేసి వైరస్ వల్ల మృతి చెందిన వారి ఊపిరితిత్తుల్లో గాయాలు ఉన్నాయని… రక్తం గడ్డకట్టడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పారు. మృతి చెందిన వారిలో కరోనా వైరస్ ప్రారంభ లక్షణాలుగా కిడ్నీల్లో గాయాలు, ఊపిరితిత్తుల్లో మచ్చలు ఉన్నట్టు తెలిపారు. మృతి చెందిన వారి ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలలో రక్తం గడ్డ కట్టినట్టు పేర్కొన్నారు.

ఇంపీరియల్ కాలేజ్ వెబ్ సైట్ లో తాజాగా ఇందుకు సంబంధించిన నివేదిక ప్రచురితమైంది. వెలుగులోకి వస్తున్న కొత్త వివరాల ద్వారా రోగులకు చికిత్స అందించడం మరింత సులభమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిశోధనల వల్ల కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఇన్‌ఫెక్షన్‌ ద్వారా సంభవించే మరణాలను ఆపవచ్చని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఈ పరిశోధనలు రోగులకు సరైన సమయంలో చికిత్స అందించటానికి ఉపయోగపడతాయని అన్నారు.

Also Read : ఏపీలో లక్షణాలు లేకపోయినా 90 శాతం మందికి కరోనా…?